Politics

Nara Lokesh: ఏపీలో ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ మరో కీలక నిర్ణయం

ఏపీలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఒక డీఎస్సీ (DSC) ఇచ్చి ఉద్యోగాలిచ్చిన ఏపీ ప్రభుత్వం (AP Government) మరో డీఎస్సీకి నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.

Nara Lokesh: ఏపీలో ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ మరో కీలక నిర్ణయం

ఏపీలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఒక డీఎస్సీ (DSC) ఇచ్చి ఉద్యోగాలిచ్చిన ఏపీ ప్రభుత్వం (AP Government) మరో డీఎస్సీకి నోటిఫికేషన్ (DSC Notification) విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నట్లు ఇవాళ (గురువారం) ప్రకటించింది. నోటిఫికేషన్ ఇచ్చిన రెండు నెలల్లోనే డీఎస్సీ పరీక్షలు (DSC Exams) నిర్వహించనుంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో అంటే నవంబర్‌లో టెట్ నిర్వహించాలని సైతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. ఇప్పటికే విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన ఆలస్యం చేయకుండానే ప్రకటన ఇచ్చేశారు.

2026 మార్చిలో పరీక్షలు నిర్వహించి ఆ వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు విద్యాశాఖ (Education Department) వెల్లడించింది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం డీఎస్సీల మీద డీఎస్సీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై గురువారం సమీక్ష నిర్వహించిన నారా లోకేష్ (Minister Nara Lokesh).. డీఎస్సీకి సంబంధించి కార్యాచరణ రూపొందించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహించాలని నారా లోకేష్ (Nara Lokesh) అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మరో కీలక నిర్ణయం కూడా నారా లోకేష్ తీసుకున్నారు. 78 మంది ఉత్తమ టీచర్లను విద్యావిధానంపై అధ్యయనానికి సింగపూర్ (Singapore) పంపాలని నిర్ణయించారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 9, 2025 4:00 PM