Politics

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్ ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ (Modi Government) గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Government Employees) ఎంతగానో ఎదురు చూస్తున్న పే కమిషన్‌కు (8th Pay Commission) ఏర్పాటుకు కేంద్రం మార్గం సుగమం చేసింది.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్ ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ (Modi Government) గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Government Employees) ఎంతగానో ఎదురు చూస్తున్న పే కమిషన్‌కు (8th Pay Commission) ఏర్పాటుకు కేంద్రం మార్గం సుగమం చేసింది. ఈ క్రమంలోనే 8వ పే కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో (Union cabinet Meeting) 8వ పే కమిషన్‌కు ఆమోదం తెలిపింది. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రంజనప్రకాశ్‌ దేశాయ్‌ (Former Supreme Court judge Ranjana Prakash Desai) ఈ 8వ పే కమిషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికను జస్టిస్‌ దేశాయ్‌ కమిషన్‌ (Justice Desai Commission) 18నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించే 8వ వేతన సంఘం నిబంధనలను కేంద్ర మంత్రివర్గం (Central Cabinet) మంగళవారం ఆమోదించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnaw) క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా మాట్లాడుతూ.. ఎనిమిదవ వేతన సంఘం 18 నెలల్లోపు సిఫార్సులను సమర్పిస్తుందని వెల్లడించారు. ఇది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, దాదాపు 69 లక్షల మంది పెన్షనర్ల భత్యాలను సవరించడానికి 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఈ కమిషన్‌కు నేతృత్వం వహిస్తుండగా, ప్రొఫెసర్ పులక్ ఘోష్ సభ్యురాలిగా ఉంటారు. 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపై రక్షణ, హోం మంత్రిత్వ శాఖలు, పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్, అలాగే రాష్ట్రాలు వంటి ప్రధాన వాటాదారుల నుంచి ఇన్‌పుట్‌లను కోరినట్లు ప్రభుత్వం జూలైలో పార్లమెంటుకు తెలియజేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు సవరించిన వేతన స్కేళ్లను ఎప్పుడు అమలు చేస్తారనే ప్రశ్నకు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అప్పట్లో 8వ సీపీసీ సిఫార్సులు చేసి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అమలును చేపడతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరించడానికి సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్రం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. 7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పాటవగా.. దాని సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. 8వ వేతన సంఘం జనవరి 1, 2026న అమలు కానుంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 28, 2025 11:09 AM