Divya Vani: చౌదరిని యాడ్ చేసుకున్న దివ్యవాణి.. కులానికే విలువా?
నటి దివ్యవాణి తాను కమ్మ కులానికి చెందిన వ్యక్తినని.. తొలుత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించే దానినని ఆ తరువాత క్రైస్తవ మతం స్వీకరించినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తప్పేమీ లేదు.
రాజకీయాల్లో లేదంటే సినిమాల్లో చౌదరి అంటేనో.. రెడ్డి అంటేనో మాత్రమే రాణిస్తారా? వేరొకరు రాణించలేరా? నిజంగా చాలా మంది మనసులో మెదిలే ప్రశ్నలివి. ఇలా ఎందరి మనసులోనో మెదులుతూ ఉంటాయి. కానీ అవి మనసు వరకే పరిమితం. నిన్న మొన్నటి వరకూ దివ్యవాణిగానూ.. బాపు బొమ్మగానూ పిలుచుకున్న ఓ నటి, రాజకీయ నాయకురాలు.. సడెన్‌గా దివ్యవాణి చౌదరిగా మారిపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
నటి దివ్యవాణి తాను కమ్మ కులానికి చెందిన వ్యక్తినని.. తొలుత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించే దానినని ఆ తరువాత క్రైస్తవ మతం స్వీకరించినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తప్పేమీ లేదు. ఈ లౌకిక సర్వ స్వతంత్ర దేశంలో ఎవరు ఏ మాతాన్ని అయినా స్వీకరించవచ్చు. ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు. కానీ సడెన్‌గా దివ్యవాణి చౌదరిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడమే ఆశ్చర్యంగా అనిపించింది.
దివ్యవాణి తనకు చౌదరిని యాడ్ చేసుకున్న తర్వాత కలిగే సందేహం ఒక్కటే.. చౌదరి అంటే తప్ప విలువ ఉండదా? మనిషిని కులం పేరుతో కాకుండా మనిషిగా గుర్తించే సమాజంలో మనం బతకడం లేదా? దివ్యవాణి ఒక్కరే కాదు.. కనీసం చౌదరి కాని వారు సైతం సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడో లేదంటే.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడో చౌదరిగా చెలామణి అవడం చూస్తున్నాం. వాస్తవానికి ఇంతకు మించిన దారుణం మరొకటి ఉండదా? వేరే కులం వాళ్లు మనుషులు కారా? అనేది ఇలాంటప్పుడే చర్చనీయాంశంగా మారుతుంది. వాస్తవానికి దివ్యవాణి వెండితెరపై అయితే బాపుబొమ్మగా మంచి పేరే తెచ్చుకుంది కానీ పొలిటికల్ స్క్రీన్‌పై మాత్రం సక్సెస కాలేకపోయారు. ఏపీ రాజకీయాల్లో కొంతకాలం పాటు కొనసాగారు. ఎందుకోగానీ టీడీపీ నుంచి బయటకు వచ్చారు.
ఒకవేళ దివ్యవాణి టీడీపీని అంటిపెట్టుకుని ఇంకొంత కాలం ఉండి ఉంటే.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగానే లబ్ది పొందేవారు. కానీ ఆమె ఓపిక పట్టలేకపోయారు. ఇక తెలంగాణ రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు కానీ అక్కడ కూడా ఆమెకు కాలం కలిసి రాలేదు. ఈ క్రమంలోనే తన పేరుకు చౌదరిని యాడ్ చేశారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆది నుంచి దివ్యవాణి చౌదరిగా కొనసాగి ఉంటే పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ సడెన్‌గా పేరుకు చౌదరిని యాడ్ చేసుకోవడంతో ఒక్కసారిగా కులానికి ఉన్న ప్రాధాన్యత మనుషులకు ఉండటం లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ‘బాపు బొమ్మ - విశ్వ మహిళ’ పేరిట మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని దివ్యవాణి నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వార్తల్లో దివ్యవాణి చౌదరి పేరు చూసిన వారంతా నెట్టింట పెద్ద చర్చే పెట్టేశారు.
ప్రజావాణి చీదిరాల