Politics

Nara Lokesh: ఆ ఒక్క మాటతో అన్ని రూమర్స్‌కూ లోకేష్ చెక్ పెట్టేశారా?

టీడీపీ, జనసేనల మధ్య చిచ్చు రగిలిస్తేనే వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం వైసీపీలో ఏ2గా ఉండి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి సైతం చెప్పారు.

Nara Lokesh: ఆ ఒక్క మాటతో అన్ని రూమర్స్‌కూ లోకేష్ చెక్ పెట్టేశారా?

టీడీపీ, జనసేనల మధ్య చిచ్చు రగిలిస్తేనే వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం వైసీపీలో ఏ2గా ఉండి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి సైతం చెప్పారు. దీనిని గట్టిగా తలకెక్కించుకుందో ఏమో కానీ ఇటీవలి కాలంలో వైసీపీ కొత్త రాగం అందుకుంది. గతంలోనూ ఇదే రాగం తీసింది కానీ వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు తిరిగి కొత్తగా టీడీపీ, జనసేనల మధ్య కలతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే తన తనయుడు నారా లోకేష్‌‌ను ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నారని వైసీపీ చెబుతోంది. మరి అప్పుడు జనసేన అధినేత పరిస్థితి ఏంటంటారా? ఆయనను కేంద్రంలోకి పంపించేస్తుందట. అన్నీ వీళ్లే డిసైడ్ చేసేసి.. దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అనవసర రాద్ధాంతాలకు ప్రయారిటీ ఇవ్వకూడదు అనుకున్నాయో ఏమో కానీ దీనిపై జనసేన కానీ.. టీడీపీ కానీ రియాక్ట్ అయ్యిందే లేదు. తాజాగా నారా లోకేష్ ఒక సదస్సులో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేసినట్టుగా అనిపిస్తోంది.

ఎప్పటికీ పెద్దన్నే..

ముంబైలోని ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా - 2026 సదస్సులో ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. దీనిలో భాగంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన భావోద్వేగపూరితంగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ తనకు జీవితాంతం పెద్దన్నగా ఉంటారని అందులో ఎలాంటి సందేహమూ లేదని తేల్చేశారు. అంతేకాదు.. పవన్‌తో లోకేష్ ఎలా ఉంటారనే దానికి సంబంధించిన వీడియోలు చాలా బయటకు వచ్చాయి. అయినా కూడా మరోసారి నేషనల్ వైడ్‌గా నారా లోకేష్ మరోసారి పవన్‌తో ఉన్న అనుబంధాన్ని గట్టిగా చెప్పారు.

అదొక పెద్ద టాస్క్..

ఇక తన తండ్రి చంద్రబాబు విషయానికి వస్తే ఆయన నవ యువకుడని తేల్చేశారు. ఆయన వయసు కేవలం పాతికేళ్లేనని చెప్పారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు పడుతున్న కష్టం, ఆయన లక్ష్యాలు, వినూత్నమైన విధానాలు చూస్తుంటే మాత్రం ఆయన యువకుడి మాదిరిగానే కనిపిస్తారన్నారు. చంద్రబాబుతో పాటు పరుగులు తీయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. చంద్రబాబు ఇచ్చే టాస్కులను పూర్తి చేయడమే తనకొక పెద్ద టాస్క్ అని నవ్వుతూ చెప్పేశారు. అమరావతిని ఒక నగరంగా దేశానికే గర్వకారణంగా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ తెలిపారు. మరోసారి ఒక రాధాని తమ విధానమని తేల్చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ అభిమతమని పేర్కొన్నారు. అమరావతితో పాటు విశాఖపట్నం, తిరుపతిలను సైతం ఆర్థిక రీజియన్లుగా తీర్చిదిద్దుతామన్నారు. మొత్తానికి నారా లోకేష్ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 28, 2026 8:05 AM