CM Chandrababu: మహిళలపై వరాల జల్లు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఎందుకు అంటారో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చెప్పేయవచ్చు. చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఎందుకు అంటారో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చెప్పేయవచ్చు. చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నారు. గతంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారో అక్కడి నుంచే సంస్కరణలు మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా మహిళలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిన చంద్రబాబు తాజాగా మరిన్ని యాడ్ ఆన్ వరాలు ప్రకటించి కూటమి ప్రభుత్వానికి మహిళలంతా మూకుమ్మడిగా జై కొట్టేలా చూస్తున్నారు.
తాజాగా సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ప్రస్తుతం అమలు చేస్తున్న రెండు కీలక పథకాలకు మరింత మెరుగులు దిద్దేలా పథక రచన చేస్తున్నారు. సూపర్ 6 (Super Six)కి సంబంధించిన హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకంలో మిగిలిపోయిన లబ్దిదారులందరికీ వెంటనే నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్‌ల (District Collectors)కు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో దాదాపు 300 మధ్యలో పెండింగ్ దరఖాస్తులున్నాయి. వాటన్నింటినీ మరోసారి పరిశీలించాలని చంద్రబాబు (Chandrababu) సూచించారు. అర్హులైన ప్రతి తల్లికి ఎంత మంది ఉన్నా.. నిధులను మంజూరు చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించారు. ఒకవైపు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని విస్తరించడమే కాకుండా బస్సుల్లో ఎందరు మహిళలు ఎక్కినా అడ్డు చెప్పవద్దని సైతం ఏపీఎస్ఆర్టీసీ (APSRTC)కి ఆదేశాలు జారీ చేశారు.
బస్టాప్ లేదంటూ వంకలొద్దు..
అంతేకాకుండా బస్టాండ్ (Bus Stand)లో టికెట్ తీసుకుని నిర్ణీత స్టేజ్ వరకూ వెళ్లే బస్సుల్లో సైతం ఇక మీదట మహిళలకు ఉచిత ప్రయాణాన్ని (Free Journey) కల్పించాలని ఆదేశించారు. నలుగురికి మించిన మహిళలు ఎక్కడ బస్సు ఆపినా బస్సు ఆపి వారిని ఎక్కించుకోవాలని చంద్రబాబు సూచించారు. బస్టాప్ లేదంటూ వంకలు చెప్పవద్దని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 ఘాట్ రోడ్లు (Ghat Road) సహా అన్ని దేవాలయాలకు (Temples) ఉచిత బస్సులను నడపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో (RTC Bus) తోటి ప్రయాణికులు ఇబ్బంది పడేలా ఎవరు వ్యవహరించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ సైతం ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు అయితే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారు.. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతున్నారు. ప్రత్యర్థులకు కనీసం విమర్శించేందుకు సైతం అవకాశం ఇవ్వడం లేదు. కీలెరిగి వాత పెట్టడం ఎలాగో ఏపీ సీఎం చంద్రబాబుకి బాగా తెలిసినట్టుంది.
ప్రజావాణి చీదిరాల