Politics

Janasena: జనసేనలో కులం చిచ్చు.. అప్పటి వీడియో వైరల్..

వాస్తవానికి ఏపీ కులానికి పెద్ద పీట వేస్తుందనడంలో సందేహమే లేదు. ఏపీలో రెండు, మూడు కులాలదే హవా అని చెబుతారు. అవి కమ్మ, కాపు. గోదావరి జిల్లాల వైపు వెళితే కాపుల హవా ఎక్కువగా ఉంటుంది.

Janasena: జనసేనలో కులం చిచ్చు.. అప్పటి వీడియో వైరల్..

21కి 21 సీట్లు గెలిచి కాలర్ ఎగురవేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టి హూందాగా పని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అంతకు ముందు ఏమైనా వివాదాలున్నాయేమో కానీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మాత్రం ఆయనపై ఎలాంటి వివాదాలు లేవు. ఆరోపణలు అంతకన్నా లేవు. ప్రశంసలు తప్ప విమర్శలసలే లేవు. అలాంటి జనసేన ప్రస్తుతం వరుసగా అప్రతిష్ట పాలవుతోంది.

ఏపీలో కులాలదే హవా..

ఆయన పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఒకరైతే.. అధికార ప్రతినిధి మరొకరు. ఇద్దరూ కలిసి జనసేనను ఏం చేయాలనుకుంటున్నారో వారికే తెలియాలి. అమ్మాయి పిచ్చిలో పడి చక్కగా ట్రాప్‌లో ఇరుక్కున్నారో.. లేదంటే మరొకటి జరిగిందో.. ఏది ఏమైనా తనే కాకుండా పార్టీని సైతం నడిరోడ్డుపై పడేశారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఇక గతంలో జనసేన అధికార ప్రతినిధి కన్నా వెంకట్ మెహర్ రజనీ చేసిన వ్యాఖ్యలు జనసేన ప్రతిష్టను దారుణాతి దారుణంగా దెబ్బతీసేలా ఉన్నాయి. వాస్తవానికి ఏపీ కులానికి పెద్ద పీట వేస్తుందనడంలో సందేహమే లేదు. ఏపీలో రెండు, మూడు కులాలదే హవా అని చెబుతారు. అవి కమ్మ, కాపు. గోదావరి జిల్లాల వైపు వెళితే కాపుల హవా ఎక్కువగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో కమ్మ, రాయలసీమ వైపు వెళితే రెడ్డీల హవా ఎక్కువగా ఉంటుంది.

వైఎస్ఆర్‌కు ఇద్దరు భార్యలట..

మిగిలిన కులాలు లేవని కాదు కానీ ఉన్నా వారి ప్రాబల్యం తక్కువే. ఇతర కులాల వారు వాస్తవానికి ఓట్ల సమయంలో మాత్రమే పనికొస్తారు. ఇదంతా ఇప్పుడు అప్రస్తుతంలే కానీ మొత్తానికి జనసేన తులసివనంలోకి గంజాయి మొక్కలు అయితే ప్రవేశించాయని . ఒకరకంగా చెప్పాలంటే.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒకరిని.. అధికార ప్రతినిధిగా పుష్పగుచ్చం ఇచ్చి మరీ మరొకరిని పవన్ కల్యాణ్ పెంచి పోషించారని ఏపీ ప్రజానీకంలో చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. జనసేన అధికార ప్రతినిధి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవడమే. ఆమెకు పదవి రాక ముందు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. కాపుల అబ్బాయిలు వెనుక అన్ని కులాల ఆడపిల్లలు వెంటపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సైతం రెండో భార్య ఉందంటూ సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కుల పిచ్చి ఏంటో కానీ టెక్నాలజీ యుగంలో కూడా ఏపీని వదలడం లేదు.

దెబ్బగొట్టడమే పనిగా పెట్టుకున్నారా?

ముఖ్యంగా జనసేనను ఇబ్బందుల్లోకి నెట్టేందుకైతే కొందరు కంకణం కట్టుకున్నారనడంలో సందేహమే లేదు. అసలు ఏపీలో సమస్యలే లేవా? ఉన్నా వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో వైసీపీ కేడర్ లేదా? జనసేన లేదంటే టీడీపీలను ఏదో ఒకరకంగా దెబ్బకొట్టడమే పనిగా పెట్టుకున్నారా? ఎప్పటివో వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్ చేయడం వెనుక ఉద్దేశమేంటి? వాస్తవానికి జనసేన అనేది ఏపీలో గట్టిగా పాతుకుపోయింది. ఒక ఎమ్మెల్యే ఏదో చేశారనో.. అధికార ప్రతినిధి ఎప్పుడో ఏవో వ్యాఖ్యలు చేశారనో ఇప్పుడు జనాలు వాటిని పట్టించుకుని జనసేనను మట్టుబెట్టడమనేది ఇప్పట్లో అయితే జరగదు. జనసేనాని చాలా గట్టిగా జనం గుండెల్లో పాతుకుపోతున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 4, 2026 11:37 AM