CM Chandrababu: బాబు, బాలయ్య మధ్యలో తోక మీడియా..
బాలయ్య (Balayya).. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)పై తీవ్ర విన్నారా? తీవ్ర అసహనంతో ఉన్నారట.

అదిగో పులి అంటే.. ఇదిగో తోక అంటూ సోషల్ మీడియా (Social Media)లో రచ్చ జరుగుతూ ఉంటుంది. దీనికి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏమీ తీసిపోలేదనుకోండి. ఇక ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రెండు వర్గాలు.. ఒకటి ప్రభుత్వ అనుకూలం.. రెండోది వ్యతిరేకం. వీటికి తోకలుగా కొన్ని చోటా మోటా మీడియా సంస్థలు. ప్రతి దానికి కారణాలను విశ్లేషించి.. ఏమీ దొరక్కపోతే సొంతంగా కారణాలను ఊహించి మరీ జత చేసి రచ్చ చేస్తారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు. వీటిని దాదాపుగా అందరూ మరచిపోయారు. కానీ ప్రభుత్వ వ్యతిరేక మీడియా సంస్థలు మాత్రం మరచిపోలేక పోతున్నాయి. కూల్‌గా ఎందుకు ఊరుకుంటాయి? రచ్చ చేసి వదులుతున్నాయి.
బాలయ్య (Balayya).. ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh)పై తీవ్ర విన్నారా? తీవ్ర అసహనంతో ఉన్నారట. ఆ విషయాన్ని ఈ మీడియా సంస్థలకు వచ్చి చెవిలో చెప్పినట్టున్నారు. పైగా జనసేన (Janasena) శ్రేణులేమో బాలయ్యపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఎవ్వరినీ మరిచిపోనివ్వరు కదా.. ఏ విషయమూ లేనప్పుడు ఉన్నదానికి మంట పెట్టి ఏదైనా జరుగుతుందేమో చూడాలి. ఏమీ జరగలేదంటే.. ఇప్పటికే జరిగిపోయిన అంశాలను తిరగదోడి మంటపెట్టాలి. ఇదే తంతు. ఇక తాజా విషయం ఏంటంటే.. జనసేన నేతలు చంద్రబాబు (Chandrababu), నారా లోకేశ్ (Nara Lokesh)పై గుర్రుగా ఉన్నారు కాబట్టి వారిని కూల్ చేయడం కోసం చంద్రబాబు వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కలుస్తున్నారట. పైగా బాలయ్ కూడా చంద్రబాబు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ (Pawan)ను కలుస్తున్నారనే భావనలో ఉన్నారట. మరి బాలయ్య మనసులోకి దూరి ఎవరు చూసి వచ్చారో ఏమో సదరు మీడియా సంస్థే చెప్పాలి.
చంద్రబాబు, నారా లోకేశ్‌లపై బాలయ్య తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా సదరు మీడియా సంస్థ కథనం. ఇది మాత్రమేనా? తెలుగు తమ్ముళ్ల ఆత్మాభిమానాన్ని మెగా బ్రదర్స్ (Mega Brothers) వద్ద తాకట్టు పెడుతున్నారని నానా రచ్చ. ఇది మాత్రమేనా? గతంలోనూ ఎక్కడ టీడీపీ (TDP), జనసేన (Janasena) జత కడతాయోమోనని తెగ కంగారు పడి.. ఇరు పార్టీల కార్యకర్తల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా రోజుకో కథనాన్ని వండి వార్చి వడ్డించింది కూడా ఈ మీడియా ఘనులే. ఎన్ని రాతలు రాసినా కూడా జనసేన, టీడీపీ అధినేతలు పట్టించుకోలేదు. జత కట్టి మరీ అధికారం దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఇరు పార్టీల మధ్య ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలను వీడటం లేదు.
ప్రజావాణి చీదిరాల