Botsa Satyanarayana: ఇన్నాళ్లకు బొత్స తలదన్నేవాడొచ్చాడు..!
ఒకప్పుడు అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju)ను రాజకీయంగా డమ్మీని చేసి కాలర్ ఎగురవేసిన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు ఇప్పుడు ఆయన తలదన్నే వ్యక్తొకరు వచ్చారు.

తాడిని తన్నేవాడుంటే.. తల తన్నేవాడు మరొకడుంటాడని అంటారు పెద్దలు. ఒకప్పుడు అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju)ను రాజకీయంగా డమ్మీని చేసి కాలర్ ఎగురవేసిన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు ఇప్పుడు ఆయన తలదన్నే వ్యక్తొకరు వచ్చారు. 30 ఏళ్ల తిరుగులేని బొత్స ప్రస్థానానికి ఫుల్‌స్టాప్ పెట్టే తరుణం ఆసన్నమైందని అక్కడి వారంతా అంటున్నారు? అంతలా ఏం జరిగింది?
విజయనగరంలో తిరుగులేని నేతగా బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఎదిగారు. ఆయనే కాదు.. తన తరుఫున ఎవరు నిలబడినా కూడా గెలిపించుకునే సత్తా ఆయనకు ఉంది. బొత్స తిరుగులేని ప్రస్థానం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. అంతకుముందు అశోక్ గజపతి రాజు హవా నడిచేది. కానీ బొత్స రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాక అంటే గత 30 ఏళ్లుగా బొత్సకు అయితే తిరుగులేదనే చెప్పాలి. బొత్స (Botsa)ను ఢీకొట్టే నేతే విజయనగరంలో లేరన్నట్టుగా పరిస్థితి తయారైంది. కానీ అన్నట్టుగా అశోక్ గజపతిరాజును మించి ఎదిగిన బొత్సకు ఇప్పుడు ఆయనను డమ్మీని చేసే వ్యక్తి వచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన మరెవరో కాదు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున (DCCB Chairman Kimidi Nagarjuna). దీనికి కారణం లేకపోలేదు. అదేంటో చూద్దాం.
ఇన్నాళ్లకు మారిన సీన్..
ప్రస్తుతం విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవం (Paiditalli Sirimanotsavam) అత్యంత వైభవంగా జరుగుతోంది. ఒప్పుడు విజయనగర రాజవంశీయులకు తిరుగుండేది కాదు. ఈ ఉత్సవాన్ని రాజవంశమంతా తమ కోటపై నుంచి తిలకించేది. వీరికి మించి ఎవరికీ ఆ అవకాశం ఉండేది కాదు. కానీ బొత్స పొలిటికల్‌గా స్ట్రాంగ్ అయిన తర్వాత రాజవంశానికి పోటీగా కోటకు సమీపంలో డీసీసీబీ భవనం (DCCB Building)పై 1996లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. దీంతో గత 30 ఏళ్లుగా రాజవంశీయులకు పోటీగా.. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్థులకు వేదికగా ఈ డీసీసీబీ భవనం మారిపోయింది. సిరిమానోత్సవాన్ని మంత్రులు, ప్రభుత్వాధికారులు సైతం రాజవంశీయులకు ధీటుగా కోట బురుజుకు సమీపంలో ఉన్న డీసీసీబీ భవనంపై నుంచి వీక్షించేవారు. ఈ 30 ఏళ్లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా బొత్స ఏమాత్రం తగ్గలేదు. చివరకు తెలంగాణ-ఏపీ (Telangana-AP) విడిపోయిన వెంటనే అంటే 2014-19 మధ్య టీడీపీ (TDP) అధికారంలో ఉండగా.. బొత్సకు ఎలాంటి పదవీ లేదు. అయినా కూడా ఇదే తంతు కొనసాగింది. కానీ ఇప్పుడు ఇన్నాళ్లకు సీన్ మారింది.
రాజదర్పానికి బ్రేక్..
ప్రస్తుతం బొత్స శాసన మండలి ప్రతిపక్ష నేత (Leader of the Opposition in the Legislative Council) హోదాలో ఉన్నారు. అయినా కూడా ఆయనకు కిమిడి నాగార్జున గట్టి షాక్ ఇచ్చారు. డీసీసీబీ భవనంపై ఏర్పాటు చేసిన శిబిరానికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. 30 ఏళ్ల బొత్స తిరుగులేని ప్రస్థానానికి తలిగిన గట్టి దెబ్బ ఇది. బొత్స దీనిపై సైలెంట్ అవలేదు. తమ కుటుంబంతో పాటు తమ పార్టీ నేతలకు డీసీసీబీ శిబిరంపై నుంచి ఉత్సవాలను వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలంటూ లేఖ రాశారు. కానీ కిమిడి నాగార్జున మాత్రం ససేమిరా కుదరదని చెప్పడంతో సైలెంట్ అయ్యారు. ఇది విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. 30 ఏళ్ల పాటు రాజవంశీయులతో సమానంగా బొత్స తన హవాను కొనసాగించారు. ఒక్కసారిగా ఆ రాజదర్పానికి బ్రేక్ పడటంతో ఆయన అనుచరులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలైతే ఈ పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీకి గట్టి నేత దొరికాడు..
ఇప్పుడు రాజవంశానికి సరైన గౌరవం దక్కుతోందని అంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామ.. అప్పుడు తమ పవర్ ఏంటో చూపిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఒక సాధారణ వ్యక్తిని ఢీకొడితే ఫలితం ఏముంటుంది? ఇలాంటి సత్తా ఉన్న నేతను ఢీకొడితేనే అవతలి నేత సత్తా ఏంటో తెలుస్తుంది. పైగా కిమిడి నాగార్జున తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలన్నీ ఆయన వైపు చూశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా నాగార్జున మారారు. బొత్స వంటి నేతను ఢీకొట్టి రాజకీయంగా ఆయన చాలా స్ట్రాంగ్ అయ్యారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కిమిడి నాగార్జునకు టీడీపీ మంచి ప్రాధాన్యమిస్తుందనడంలో సందేహమే లేదు. విజయనగరం జిల్లాలో అయితే టీడీపీ (TDP) ఇన్నాళ్లకు గట్టి నేత దొరికాడనడంలో సందేహమే లేదని ఏపీ వాసులంతా చెప్పుకుంటున్నారు.
ప్రజావాణి చీదిరాల