Politics

Sensational News: తెలంగాణలో ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం.. 10 మంది ఔట్!

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాల పర్వం కొనసాగిస్తారని తెలిసింది. అటు ఈటల, ఇటు ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రధాన పరిణామాలు త్వరలోనే తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.

Sensational News: తెలంగాణలో ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం.. 10 మంది ఔట్!

అవును.. తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) మరోసారి వేడెక్కాయి. ప్రధానంగా, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు, గులాబీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో (Congress) చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారనే వార్తలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బీజేపీ (BJP)లో ఈటలకు సముచిత స్థానం లభించడం లేదన్న అసంతృప్తి నెలకొందనే చర్చ కొన్నాళ్లుగా నడుస్తూనే నడుస్తోంది. దీనికి తోడు, కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్‌కు చెందిన కొందరు బీజేపీ నేతలు (BJP Leaders) ఆయనకు పార్టీలో ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ప్రచారం గట్టిగానే ఉంది. ముఖ్యంగా, బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణించే అవకాశం ఉందన్న భయంతోనే బీజేపీలోని కొందరు నేతలు ఈటల రాజేందర్‌ (Eatala Rajendar)ను పక్కన పెడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో ఉండలేక, కాంగ్రెస్ వైపు వెళ్లలేక, బీఆర్ఎస్ మాత్రమే ఏకైక మార్గమన్న ఆలోచనలో ఈటల ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగానే ప్రచారం జరుగుతున్నది.

ని‘దాన’మైనా రాజీనామా!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) విషయంలో అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆయన, బీఆర్ఎస్ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేసి, కాంగ్రెస్ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నందున ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయమని లీగల్ టీమ్‌లు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ (AICC) పెద్దలకు తన పరిస్థితిని వివరించారని ప్రచారం జరుగుతోంది. అనర్హత కంటే ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేసి, బదులుగా మంత్రి పదవి లేదా ఇతర హామీ కోరినట్లు ఊహాగానాలు బలం పుంజుకున్నాయి. సుప్రీంకోర్టు (SupremeCourt) ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ (Speaker Gaddam Prasad) త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఉన్నారు. వారికి మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని గడువు విధించినట్లు సమాచారం. అందుకే, స్పీకర్ విచారణకు హాజరవుతారా? లేక అంతకంటే ముందే రాజీనామా చేస్తారా? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒకరి తర్వాత మరొకరు!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇటీవల పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, తెలంగాణలో ఆరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. స్పీకర్ త్వరలో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయవచ్చని విస్తృతంగా చర్చ జరుగుతోంది. అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్న ఆరు స్థానాలు చూస్తే.. ఖైరతాబాద్ (దానం నాగేందర్), శేరిలింగంపల్లి (అరికెపూడి గాంధీ), రాజేంద్రనగర్ (ప్రకాష్ గౌడ్), చేవెళ్ల (కాలె యాదయ్య), స్టేషన్ ఘనపూర్ (కడియం శ్రీహరి), భద్రాచలం (తెల్లం వెంకట్రావు). ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు తమ అసలు పార్టీలను వదిలి మరో పార్టీలో చేరడంతో వీరిపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, 10 మంది ఎమ్మెల్యేలలో 8 మందిపై విచారణ పూర్తయి, స్పీకర్ తన తుది తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. దానం, కడియం అంశం తేలిన తర్వాతే 10 మందిపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాల పర్వం కొనసాగిస్తారని తెలిసింది. అటు ఈటల, ఇటు ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రధాన పరిణామాలు త్వరలోనే తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలు మెండుగ

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 21, 2025 7:43 AM