Politics

Balakrishna: అభిమానుల కోరిక విని అవాక్కైన బాలయ్య.. రియాక్షన్ ఏంటో తెలిస్తే..

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Hindupuram MLA Nandamuri Balakrishna)ను అభిమానులు ఇవాళ (సోమవారం) ఓ కోరిక కోరారు. అది విన్న బాలయ్య (Balayya) అవాక్కయ్యారు. ఎప్పుడూ లేనిది.. ఎందుకిలా?

Balakrishna: అభిమానుల కోరిక విని అవాక్కైన బాలయ్య.. రియాక్షన్ ఏంటో తెలిస్తే..

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Hindupuram MLA Nandamuri Balakrishna)ను అభిమానులు ఇవాళ (సోమవారం) ఓ కోరిక కోరారు. అది విన్న బాలయ్య (Balayya) అవాక్కయ్యారు. ఎప్పుడూ లేనిది.. ఎందుకిలా? అని ఆయన ఆశ్చర్యపోయారు. తనే ఏనాడు అలాంటి ఆలోచన చేయలేదు. ఎందుకో తనకు అవసరం లేదనిపించి ఉండొచ్చు. పైగా సినిమాల్లో బాలయ్య చాలా బిజీ. అలాంటి సమయంలో వేరే ఎలాంటి అదనపు భారం పెట్టుకోవాలని ఆయన భావించి ఉండకపోవచ్చు. ఇంతకీ అభిమానుల కోరిక ఏంటి? దానికి బాలయ్య రియాక్షన్ (Balayya Reaction) ఏంటి? తెలుసుకుందాం.

టీడీపీ (TDP)కి హిందూపురం అనేది కంచుకోట. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా హిందూపురం సీటు మాత్రం టీడీపీదే. అక్కడ కొన్ని దశాబ్దాలుగా నందమూరి కుటుంబీకులే (Nandamuri Family) ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం ఇక్కడి నుంచే వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే బాలయ్య కొంచెం కోపిష్టి అని అంటుంటారు. అభిమానులు కూడా ఆయనను అలాగే సతాయిస్తూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా తన నియోజకవర్గ ప్రజల విషయంలో మాత్రం ఆయన సాఫ్ట్ కార్నర్‌తోనే ఉంటారు. ఎన్ని పనులున్నా ఎలా ఉన్నా తన నియోజకవర్గంపై నజర్ వేస్తారు. ఇదిలా ఉండగా.. బాలయ్య ఎందుకోగానీ ఏనాడూ మంత్రి పదవుల జోలికి మాత్రం వెళ్లలేదు.

ఆ ఊసే ఎత్తలేదు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాలయ్య పక్కాగా మంత్రి అవుతారంటూ టాక్ నడిచింది. ఇప్పుడే కాదు.. 2014లోనూ టీడీపీ ప్రభుత్వం (TDP Government) వచ్చినప్పుడు కూడా ఇదే టాక్. కానీ బాలయ్య మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. రెండు సార్లు ఆయన హిందూపురం ఎమ్మెల్యే (Hindupuram MLA)కు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు అభిమానుల నుంచి ఇదే డిమాండ్ వస్తోంది. తాజాగా హిందూపురంలో పర్యటించిన బాలయ్యకు మంత్రి పదవి చేపట్టాలని అభిమానులు కోరారు. బాలయ్యకు ఎలా స్పందించాలో అర్థం కానట్టుంది. ఆయన ఒక చిరునవ్వు విసిరేసి వెళ్లిపోయారట. దానర్థం ఏమిటా? అని అభిమానులు (Balakrishna Fans) తలలు పట్టుకుంటున్నారు. బాలయ్య ఏదో ఒకటి చెబితే బాగుండేదని అంతా అనుకుంటున్నారట.

డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం..

వాస్తవానికి బాలయ్య సినిమాల్లో చాలా బిజీ. ఇలాంటి తరుణంలో మంత్రి పదవి చేపడితే పూర్తి స్థాయిలో రాజకీయాలకు పరిమితం అవ్వాల్సి వస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan kalyan) మాదిరిగా సినిమా షూటింగ్‌లకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టంగా మారుతుంది. అలాంటి తరుణంలో సినిమాల ఎంపిక క్లిష్టంగా మారుతుంది. ఎమ్మెల్యేగా ఉంటేనే రెండు వైపులా రాణించవచ్చనేది బాలయ్య భావనగా తెలుస్తోంది. పైగా బావ నారా చంద్రబాబు నాయుడు సీఎం (CM Nara Chandrababu Naidu), అల్లుడు నారా లోకేష్ మంత్రి (Minister Nara Lokesh).. ఇంక తనకు ఏం కావాలి? మంత్రి పదవి ఉన్నా.. లేకున్నా ఒకటే. ఆయనకు ఆ స్థాయిలో గౌరవం దక్కుతోంది. అందుకే బాలయ్య ఏనాడూ ఆ దిశగా ఆలోచన చేయలేదని సమాచారం. ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆయన పదవులపై ఆశ పడతారేమో చూడాలి.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 13, 2025 3:36 PM