Janasena: మరోసారి ఏపీకి కేంద్రం ఛాన్స్.. నెక్ట్స్ బంపరాఫర్ జనసేనకేనా?
కేంద్రంలో నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీనికి కౌంట్ డైన్ కూడా ప్రారంభమైంది. ఏపీ విషయానికి వస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
కేంద్రంలో నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీనికి కౌంట్ డైన్ కూడా ప్రారంభమైంది. ఏపీ విషయానికి వస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి మరో బంపరాఫర్ కూడా కేంద్రం ఇవ్వనున్నట్టు టాక్. అయితే ఈ బంపరాఫర్ జనసేనకు దక్కనుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో నిజమెంత? అసలేం జరుగనుంది? తెలుసుకుందాం.
ఒక ఎంపీ ఉన్నవారికి సైతం..
ఏపీ నుంచి ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. టీడీపీకి ఒక కేబినెట్ సహాయ మంత్రి పదవి సైతం దక్కింది. ఏపీ నుంచి ఒక సహాయ మంత్రి పదవి టీడీపీకి, మరొకటి బీజేపీకి ఇచ్చారు. ఇక బ్యాలెన్స్‌గా జనసేనకు ఏదో ఒకటి చేయాల్సి ఉంది. దానికి ఇప్పుడు సమయం ఆసన్నమైందని అంటున్నారు. దీనికి కారణం కూడా ఉంది. అదేంటంటే.. 2024 జూన్ 9న ఏర్పాటు అయిన మోదీ మంత్రివర్గంలో దాదాపుగా మిత్రులందరికీ కేంద్ర బెర్తులు దక్కడమే. ఆ సమయంలో ఒక ఎంపీ ఉన్నవారికి సైతం మంత్రి పదవి దక్కింది. కానీ జనసేనకు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. అందుకే ఇప్పుడు గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ముగ్గురిలో పవన్ అనుగ్రహం ఎవరికి?
జనసేనకు ఇద్దరు ఎంపీలున్నారు. ఆ ఇద్దరిలో ఎవరి పేరు దక్కవచ్చనే విషయమై కూడా టాక్ నడుస్తోంది. ఆయన మరెవరో కాదు.. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన బాలశౌరి మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కూడా కావడం ఆయనకో ప్లస్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే బాలశౌరికే ఛాన్స్ అంటూ టాక్ నడుస్తోంది. అలాగే జనసేన నుంచి ఎంపీగా విజయం సాధించిన మరొకరు ఉదయ్ శ్రీనివాస్. తొలిసారిగా విజయం సాధించారు. వీరిద్దరిలో అధినేత అనుగ్రహం ఎవరికి ఉంటే వారే కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకునే అవకాశం ఉంది. రాజ్యసభ ద్వారా జనసేన ఎంపీగా లింగమనేని రమేష్ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి పవన్ అనుగ్రహం ఉంటే వారికే దక్కుతుందనడంలో సందేహం లేదు.
అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం..
ఒకవేళ మరోసారి కూడా టీడీపీకే అవకాశం ఇస్తే మాత్రం ఈసారి రాయలసీమకు అవకాశం దక్కవచ్చని టాక్. పైగా మహిళా ఎంపీకి దక్కుతుందంటూ ప్రచారం గట్టిగానే నడుస్తోంది. ఈసారి రాష్ట్రంలో కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టాక్ నడుస్తోంది. అలా ఉంటే బీజేపీకి మరో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఈసారి బీజేపీ సీనియర్ నేత సోమూ వీర్రాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సోమూ వీర్రాజుకు కేంద్ర పెద్దలతో మంచి సంబంధ బాందవ్యాలున్నాయి. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్ప కీలక పదవి అనుభవించిందే లేదు. అందుకే ఈసారి సోమూ వీర్రాజుకు అదృష్టం వరించనుందని అంటున్నారు. మొత్తమ్మీద అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ మంత్రివర్గ విస్తరణపై టాక్ గట్టిగానే నడుస్తోంది.