Pawan Kalyan: ఏ సినిమాలోనూ చూడని సెట్టింగ్.. నోరెళ్లబెట్టిన పవన్
వైసీపీ అధినేత జగనా.. మజాకా.. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతే నోరెళ్లబెట్టించారు. ఇన్ని సినిమాలు చూసిన పవన్ కల్యాణ్ ఎక్కడా కూడా ఇలాంటి సెట్టింగ్ చూడలేదు.

వైసీపీ అధినేత జగనా.. మజాకా.. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతే నోరెళ్లబెట్టించారు. ఇన్ని సినిమాలు చూసిన పవన్ కల్యాణ్ ఎక్కడా కూడా ఇలాంటి సెట్టింగ్ చూడలేదు. ఎన్నో దేశాలు తిరిగిన పవన్ ఇంతటి అద్భుతమైన ప్యాలెస్‌లు చూసి ఉండరు. అందుకే ఆయన అంతలా అవాక్కయ్యారు. ఈ రుషికొండ ప్యాలెస్‌కు సీ వ్యూ ఒక్కటే కాదండోయ్.. మరోవైపు హిల్ వ్యూ అదనపు అట్రాక్షన్. అవన్నీ చూసిన పవన్‌కు నోట మాట రాలేదట.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) తాజాగా విశాఖ (Visakha) వెళ్లారు. విశాఖలో మూడు రోజుల పాటు జనసేన పార్టీ (Janasena Party) విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల కోసం విశాఖకు వెళ్లిన పవన్ (Pawan) వెళ్లారు. విశాఖకు వెళుతున్నారు కాబట్టి రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace)ను సందర్శించి దానిని ఎలా వినియోగించుకోవచ్చనే విషయమై సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) సలహాలు, సూచనలు ఇవ్వమన్నారట. ఈ క్రమంలోనే తాను రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించానంటూ పవన్ చెప్పుకొచ్చారు. బిల్డింగ్ లోపల చూస్తే పెచ్చులు ఊడిపోయి.. నీళ్లు లీకవుతున్నాయని.. ఈ భవనాల వల్ల ప్రభుత్వానికి లాభం ఏమాత్రం లేకుండా పోయిందన్నారు. ఈ క్రమంలోనే ఈ పెట్టుబడి (Investment)కి బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుందనేది ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు..
మూడింతలు అదనపు ఖర్చు..
రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించిన అనంతరం దీనిపై ఆయన స్పందించిన తీరు ఆసక్తికరం. కొంతకాలం క్రితం రుషికొండ ప్యాలెస్ ఒక సంచలనం.. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. దీని పనులు ప్రారంభించిందేమో రూ.164 కోట్ల వ్యయంతో.. పూర్తి చేసింది మాత్రం రూ.453 కోట్లతో.. దాదాపు మూడింతలు అదనపు ఖర్చు. గతంలో ఇక్కడ రిసార్ట్స్ ఉండేవని.. వాటి నుంచి ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం వచ్చేదని.. వాటిని కూల్చేసి ఇప్పుడు కేవలం విద్యుత్ బిల్లులకే కోటిన్నర రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితికి వైసీపీ నేతలు (YCP Leaders) తీసుకొచ్చారంటూ పవన్ విమర్శించారు. 69 ఎకరాల్లో 7 బ్లాకులుగా నిర్మించాలని పనులు ప్రారంభించి నాలుగు బ్లాకులను మాత్రమే పూర్తి చేశారు. వాటికే రూ.453 కోట్లు ఖర్చైంది. మిగిలిన బ్లాకులను సైతం పూర్తి చేసి ఉంటే ఇంకెన్ని కోట్లు అయ్యుండేదో..
భవనంలోకి అడుగు పెడుతూనే..
పవన్ రుషికొండ ప్యాలెస్‌లో బాత్రూమ్‌ను చూసి అవాక్కయ్యారు. విలాసవంతమైన భవనాలు, సువిశాల ప్రాంగణాలు, అత్యాధునిక వసతులు, ఖరీదైన ఫర్నిచర్ చూసి పవన్ విస్తుబోయారు. ప్రజాధనాన్ని గత సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఏ విధంగా మళ్లించారో తెలుసుకుని పవన్ షాక్ అయ్యారు. అసలు భవనంలోకి పవన్ అడుగు పెడుతూనే అక్కడి అత్యంత ఖరీదైన లైటింగ్ సెట్స్.. స్విచ్ ఇలా వేయగానే అలా తెరుచునే విధంగా ఏర్పాటు చేసిన డోర్ కర్టెన్స్.. విసన కర్రలను పోలిన రెక్కల సీలింగ్ ఫ్యాన్స్ వంటివన్నీ చూసి పవన్ నోరెళ్లబెట్టారు. అయితే పాడైపోతున్న వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించగా.. ప్రస్తుతం ఎన్జీటీ (NGT)లో కేసు నడుస్తోందని వారు చెప్పారు. రుషికొండ ప్యాలెస్‌లో ఒక్కొక్క బ్లాకును 20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారని.. కేవలం దాని ఇంటీరియర్ డెకరేషన్ కోసమే రూ.39 కోట్లు ఖర్చు చేశారన్నారు. మొత్తానికి ఇవాళ రుషికొండ ప్యాలెస్‌ను చూసిన పవన్‌కు మాటలు కరువయ్యాయి.