కొద్ది రోజుల ఉత్కంఠకు తెర.. బీజేపీ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఫిక్స్
కొద్ది రోజులుగా ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ ఉత్కంఠకు నేడు (ఆదివారం) తెరపడింది. ఢిల్లీలో ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశమైంది.

కొద్ది రోజులుగా ఎన్డీయే (NDA) తరఫున ఉప రాష్ట్రపతి (Vice President) అభ్యర్థి ఎవరనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ ఉత్కంఠకు నేడు (ఆదివారం) తెరపడింది. ఢిల్లీలో ఇవాళ బీజేపీ (BJP) పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ (BJP) ఫిక్స్ చేసింది. ఎన్టీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ప్రకటించారు. సీపీ రాధాకృష్ణన్ 1957 మే 4న తిరుప్పూర్‌లో జన్మించారు. ఆయన రెండు సార్లు బీజేపీ ఎంపీగానూ.. ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ చైర్మన్ (All India Coir Board Chairman) గానూ పని చేశారు. 2024లో తెలంగాణ గవర్నర్ (Telangana Governor)గా తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) రాజీనామా చేసిన సమయంలో దాదాపు రెండు నెలలపాటు తెలంగాణకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఆయన పని చేశారు. ప్రస్తుతం సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. కాగా.. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఆగస్ట్ 21.