TDP Vs YCP: అసలు సిసలైన వార్ ప్రారంభం కాబోతోంది..
ఒక ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఓటమి ప్రపంచం అంటే ఏమిటో చూపిస్తుంది. మనవాళ్లెవరు.. పరాయివాళ్లెవరు? అనేది ఈ ఓటమితోనే తెలుస్తుంది. అలా అన్నీ తెలుసొచ్చాక..

ఒక ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఓటమి ప్రపంచం అంటే ఏమిటో చూపిస్తుంది. మనవాళ్లెవరు.. పరాయివాళ్లెవరు? అనేది ఈ ఓటమితోనే తెలుస్తుంది. అలా అన్నీ తెలుసొచ్చాక.. అలా ఓటమి నుంచి నేర్చుకోకుంటే మరోసారి దారుణ పరాజయం పాలవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి ఓటమి అనేది తనదన్న దానిని సైతం లాగేయవచ్చు. ఇప్పుడు వైసీపీ విషయంలో అదే జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) వైసీపీ (YCP) 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కు సరిపెట్టుకుంది. ఆ తరువాత అయినా అలెర్ట్ అయి ఉండాల్సింది. ఎందుకో ఆ పార్టీ అలర్ట్ అవలేదా? లేదంటే అప్పటి వరకూ యాక్టివ్‌గా ఉన్న నేతలు పార్టీ ఓటమి పాలయ్యాక సైడ్ అయిపోయారో తెలియదు కానీ పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట Ontimitta) జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ (TDP) ఘన విజయం సాధించగా.. వైసీపీ డిపాజిట్ కోల్పోయింది. ఇక ఇప్పుడు కూడా కోలుకోలేదో పార్టీని కాపాడటం ఎవరి తరమూ కాదు. అసలే వైసీపీని మరోమారు దెబ్బ కొట్టేందుకు టీడీపీ రెడీ అవుతోంది. ఈసారి అదే జరిగిందో ఇక పార్టీ కోలుకోవడం ఇక కలే అవుతుందేమో..
కావల్సినంత ఆదరణ..
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇది అనుకున్న సమయానికే నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలను సమయానుసారం నిర్వహించాలన్న రూల్ ఏమీ లేదు కానీ అధికార పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉంటే మాత్రం నిర్వహిస్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సంక్షేమ పథకాలన్నీ చక్కగా అమలవుతున్నాయి. పైగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ప్రభుత్వానికి చాలా ప్లస్ కానుంది. దీంతో ప్రస్తుతం ఏపీలోని అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ కావల్సినంత ఉంది. ఈ నేపథ్యంలో సమయానికే ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
వైసీపీ సంగతేంటి?
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు (CM Chandrababu) సైతం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు టాక్. మొత్తానికి అనుకున్న సమయానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికలు జరిగితే మాత్రం వైసీపీకి ఎక్కడా ఛాన్స్ లేకుండా చేయాలనే ధృడ సంకల్పంతో టీడీపీ ఉంది. పైగా పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేసిన జోష్‌లో ఉంది. మరి వైసీపీ సంగతేంటి? ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇంకా ఈవీఎం (EVM)లు, బ్యాలెట్లు (Ballots) అని విమర్శలు చేసుకుంటుందో కూర్చుంటుందో.. ఈసారి అయితే వైసీపీ గట్టిగా పోరాడాల్సిందే. ఏమాత్రం వెనక్కి తగ్గినా రేసులో వెనుకబడి పోతుంది. వైసీపీకి చావో రేవో తేల్చుకోవాల్సిన తరుణమిది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ వర్సెస్ వైసీపీ (TDP Vs YCP) గట్టిగానే వార్ ఉండనుంది. అసలు సిసలైన వార్ ప్రారంభం కానుందనడంలో సందేహమేలేదు.
ప్రజావాణి చీదిరాల