Telangana News: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. కీలక విషయాలివే..
తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాణికుముదిని తెలిపారు. అక్టోబర్ 23న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు

తెలంగాణలో స్థానిక ఎన్నికల(Telangana Local Body Elections)కు షెడ్యూల్ రానే వచ్చింది. అసలు ఇప్పుడు వస్తుందో రాదోనన్న సందేహాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ (Telangana Local Body Elections Schedule)ను విడుదల చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) రాణికుముదిని వెల్లడించారు. ఈ ఎన్నికలను ఐదు దశల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. దీనిలో భాగంగా.. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాణికుముదిని తెలిపారు. అక్టోబర్ 23న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలుంటాయి.
రెండో విడత పోలింగ్‌ను అక్టోబర్ 27న నిర్వహిస్తారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలను సైతం మూడు విడతలుగా నిర్వహించనున్నారు. వరుసగా.. అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ పూర్తైన వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓ్ల లెక్కింపు మాత్రం నవంబర్ 11న నిర్వహిస్తామని రాణి కుముదిని (Rani Kumudini) వెల్లడించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 565 మండలాల్లో.. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission) తెలిపింది. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక నామినేషన్ల స్వీకరణ ఎప్పటినుంచి ఎప్పటి వరకూ జరుగనుంది. తదితర ముఖ్య తేదీలను తెలుసుకుందాం.
తొలివిడత -ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 11
పరిశీలన: అక్టోబర్ 12
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 15
ఎన్నికల తేదీ- అక్టోబర్ 23
ఓట్ల లెక్కింపు- నవంబర్ 11
రెండో విడత..
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 13
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 15
పరిశీలన: అక్టోబర్ 16
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 19
ఎన్నికల తేదీ- అక్టోబర్ 27
ఓట్ల లెక్కింపు- నవంబర్ 11
తొలి విడత - గ్రామ పంచాయతీ ఎన్నికలు-
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 17
స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్ 19
పరిశీలన: అక్టోబర్ 20
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 23
ఎన్నికల తేదీ, ఫలితాలు- అక్టోబర్ 31
రెండో విడత..
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 21
చివరి తేదీ: అక్టోబర్ 23
పరిశీలన: అక్టోబర్ 24
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 27
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 4
మూడో విడత..
నామినేషన్ల స్వీకరణ- అక్టోబర్ 25
చివరి తేదీ: అక్టోబర్ 27
పరిశీలన: అక్టోబర్ 28
నామినేషన్ల ఉపసంహరణ- అక్టోబర్ 31
ఎన్నికల తేదీ, ఫలితాలు- నవంబర్ 8
ప్రజావాణి చీదిరాల