Politics

TDP: టీడీపీ డోర్స్ ఓపెన్.. లగెత్తరా ఆజామో..!

ఏపీలో రాజకీయంగా తల పండిన వారు ఒకవైపుంటే.. వాపుని చూసి బలుపు అనుకుని దెబ్బ తిన్నవారు మరొకవైపు ఉన్నారనేది నిపుణుల భావన. తల పండిన వారు చేసే రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు కదా.

TDP: టీడీపీ డోర్స్ ఓపెన్.. లగెత్తరా ఆజామో..!

ఏపీలో రాజకీయం (AP Politics)గా తల పండిన వారు ఒకవైపుంటే.. వాపుని చూసి బలుపు అనుకుని దెబ్బ తిన్నవారు మరొకవైపు ఉన్నారనేది నిపుణుల భావన. తల పండిన వారు చేసే రాజకీయం ఎలా ఉంటుందో తెలుసు కదా. ఏపీ ప్రస్తుతం అలాగే ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)కు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తోడవడంతో ఏపీలో పాలనకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. అలాంటి సమయంలో వైసీపీ (YCP)కి అధికార పార్టీని వేలెత్తి చూపడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది? ఒకవేళ వేలెత్తి చూపినా కూడా అది బూమరాంగ్ అయి వైసీపీ మెడకే చుట్టుకుంటోంది. ఇక ఇప్పుడు టీడీపీ డోర్స్ ఓపెన్ (TDP Doors Open) చేసిందంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పుడేం జరుగబోతోంది?

వారి వైఖరిలో మార్పే లేదు..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) హయాంలో అధికార యంత్రాంగాన్ని వినియోగించుకున్న తీరు విమర్శలకు దారి తీసింది. అది చాలదన్నట్టుగా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని దోచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అభివృద్ధి శూన్యం, రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా చేయడం వంటివి గత అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) వైసీపీ మెడకు ఉరితాడులా మారాయి. ఫలితంగా ఆ పార్టీ 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి మరింత దిగజారుతోంది. కొందరు నేతలు (YSRCP Leaders) అడ్రస్ లేకుండా పోయారు. కొందరు నేతలు ఉన్నా కూడా తమ ప్రభుత్వ హయాంలో టీడీపీ విషయంలో అనుసరించిన విధానమే సరికాదంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబుతున్నారు. ఇక అంబటి రాంబాబు (Ambati Rambabu), రోజా (Roja) ఉన్నా కూడా వారి వైఖరిలో మార్పేం లేదు. వారు మాట్లాడుతున్న విధానం పార్టీని మరింత పాతాళానికి తొక్కేస్తోంది తప్ప పైకి తీసుకు వస్తున్నదైతే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు ఏం చేయాలి? అంటే ఏం చేయాలో అదే చేస్తున్నారు.

ఎమ్మెల్యేలుగా ఎంపికై ఏం ప్రయోజనం?

వైసీపీకి ఒక వ్యూహం అంటూ లేకుండా పోయింది. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) బెంగుళూరు ప్యాలెస్‌కు షిఫ్ట్ అయిపోయారు. ఎప్పుడో ఒకసారి ఆయన వచ్చి కనబడి వెళుతున్నారు. దీంతో వైసీపీ చాలా వీక్ అయిపోయింది. ముఖ్యంగా 2024 ఎన్నికల షాక్ నుంచి కోలుకునే పరిస్థితే లేదంటే జడ్పీటీసీ ఉపఎన్నిక లో పులివెందుల (Pulivendula)లో సైతం డిపాజిట్ కోల్పోవడమనేది ఆ పార్టీకి అతి పెద్ద దెబ్బ. ఇలాంటి సమయంలో ఆ పార్టీలో ఉండలేక ముగ్గరు ఎమ్మెల్సీలు టీడీపీ పంచన చేరారు. మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar), వల్లి కల్యాణ్ చక్రవర్తి (Valli Kalyan Chakravarthi), కర్రి పద్మశ్రీ (Karri Padmasri)లు సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఆ ముగ్గురూ గట్టు దాటడం ఇప్పుడు ఆ పార్టీలోని చాలా మంది నేతలకు బలం చేకూరినట్టైంది. ఎమ్మెల్యేలుగా ఎంపికై ఏం ప్రయోజనం? పార్టీ అధికారంలో లేదు. పైగా అసెంబ్లీకి వెళ్లి ఏదైనా సమస్యపై మాట్లాడదామా? అంటే అధినేత జగన్ వెళ్లనివ్వరు.. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేకు తమ నియోజకవర్గంలో ఏం గౌరవం ఉంటుంది? అసలు ఎమ్మెల్యేగా ఉండి ఏం ప్రయోజనం?

కొత్త వారిని తీసుకుని ఏం చేయాలి?

ప్రస్తుతం ఇదే ఆలోచన ఆ పార్టీ నేతల్లో వస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే వారు సైతం గట్టు దాటేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. పైగా ఇప్పట్లో వైసీపీ కోలుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు సరికదా.. తమ అధినేత వైఖరిలోనూ మార్పు వచ్చే అవకాశమే కనిపించడం లేదని భావిస్తున్నారట. ముగ్గురు ఎమ్మెల్సీల బాటలోనే పసుపు కండువా కప్పుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు ఉవ్విళ్లూరుతున్నారట. వాస్తవానికి టీడీపీ ద్వారాలు తెరిచి ఉంటే ఎప్పుడో ఈ పని జరిగిపోయి ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ టీడీపీలో నేతలకు కొదువేం లేదు. ఉన్న స్థానాలను సర్దుబాటు చేయడమే అధినేతకు తలకు మించిన భారంగా పరిణమించింది. ఇక కొత్త వారిని తీసుకుని ఏం చేయాలనేది చంద్రబాబు భావనగా తెలుస్తోంది. అందుకే డోర్స్ ఓపెన్ చేసే ఆలోచన కూడా ఆయన చేయలేదట. ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్ అవడంతో తాము కూడా ఎలాగోలా టీడీపీలో చేరాలని వైసీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారని టాక్. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేస్తుందనడంలో సందేహమే లేదు. మొత్తానికి టీడీపీ డోర్స్ ఓపెన్ అయ్యాయి.. లగెత్తరా ఆజామో అని వైసీపీ నేతలు అనుకుంటున్నారని ఏపీలో అంతా చెప్పుకుంటున్నారు.

ప్రజావాణి చీదిరాల

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 20, 2025 5:26 AM