Politics

Harish Rao: టార్గెట్ హరీష్‌రావు స్టార్ట్ అయినట్టేనా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా కేటీఆర్ (KTR) ఎందుకో బాగా డౌన్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో నంబర్ 2 ఎవరంటే ఇప్పుడైతే ఎవరైనా చెప్పేది హరీష్ రావు పేరే.

Harish Rao: టార్గెట్ హరీష్‌రావు స్టార్ట్ అయినట్టేనా?

ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అంటే ఎందుకోగానీ ఒక్క మాజీ మంత్రి హరీష్ రావు స్వరమే వినిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా కేటీఆర్ (KTR) ఎందుకో బాగా డౌన్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో నంబర్ 2 ఎవరంటే ఇప్పుడైతే ఎవరైనా చెప్పేది హరీష్ రావు పేరే. అసలు ఆది నుంచి కూడా అధినేత కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచింది హరీష్‌రావే. మధ్యలో అంటే తెలంగాణ, ఆంధ్ర విడిపోయి.. అప్పట్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేటీఆర్ బాగా హైలైట్ అయ్యారు. ఆ తరుణంలో హరీష్‌రావు (Harish Rao)ను తొక్కేసే యత్నం కూడా తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ చేశారు. కానీ జనంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో కాస్త తగ్గారు. ఇక ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాక బీఆర్ఎస్‌లో పరిస్థితులు మారిపోయాయి. ఒకరకంగా నిజం మాట్లాడుకోవాల్సి వస్తే కేటీఆర్‌ను పట్టించుకునేవారే లేరని చెప్పాలి. అందుకే ఆయన ఎంత గొంతు చిచ్చుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోవట్లే. ఇదంతా ఓకే కానీ ఇంతలా హరీష్‌ ఎదుగుతుంటే తిరిగి తండ్రీకొడుకులు చూస్తూ ఊరుకుంటారా? ఇప్పటికే హరీష్‌కు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైందని టాక్.

మరొకరెవర్నీ సహించరట..

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)నే గులాబీ పార్టీ వదల్లేదు. సొంత బిడ్డ అయినా కూడా సస్పెండ్ చేసి రామ్ రామ్ చెప్పేసింది. మరి హరీష్‌రావును వదులుతుందా? అల్రెడీ టార్గెట్ ఫిక్స్ అని తెలుస్తోంది. ఇక ముహూర్తమే ఫిక్స్ కావాల్సి ఉందని టాక్ నడుస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్‌ (BRS)లో ఓ సంప్రదాయం ఉందని.. పార్టీలో ఎవరైనా ఎదిగితే నిర్దాక్షిణ్యంగా తొక్కేస్తారని ఇతర పార్టీల నేతలు చెబుతున్న మాట. అలాంటిది కేసీఆర్ తర్వాత హరీష్‌రావే అనే ప్రచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. పార్టీలో కేసీఆర్ తర్వాత ఉంటే కేటీఆర్ ఉండాలి తప్ప మరొకరెవర్నీ వారు సహించరనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. హరీష్‌రావు విషయానికి వస్తే.. ఆయనొక మాస్ లీడర్. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. అలా తనకు తాను మంచి పాపులారిటీని అయితే సంపాదించుకున్నారు. పైగా ప్రతి ఒక్క విషయంపై వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ తరుఫున ఎక్కువగా హరీష్ రావు గళమే గట్టిగా వినిపిస్తోంది. ఇంత చేస్తున్న హరీష్‌ను పార్టీలో అయితే ఉంచరని టాక్.

తానా అంటే తందానా అనాలట..

ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే.. 2001లో టీఆర్ఎస్ (TRS) పార్టీని కేసీఆర్ స్థాపించారు. ఆ సమయంలో ఆలె నరేంద్ర పార్టీలో చేరి కీలకంగా పని చేశారు. ఆయనే నంబర్ 2 అన్నట్టుగా నడిచింది వ్యవహారం. వెంటనే కేసీఆర్ ఆయనకు చెక్ పెట్టారు. ఇదే బాటలో ఈటల రాజేందర్ ఉన్నారు. అలాగే విజయ రామారావు, కేకే మహేందర్ రెడ్డి, విజయశాంతి, గాదే ఇన్నయ్య, కోదండరామ్ వంటి వారు ఎందరో ఉన్నారు. చివరకు కూతురు కవిత కూడా కేసీఆర్ బాణానికి చిక్కి విలవిల్లాడిపోయిన వారిలో ఉన్నారు. ఇంత చరిత్ర చూసిన తర్వాత ఎవరైనా హరీష్‌రావును పార్టీలో కేసీఆర్ ఉంచుతారని అనుకుంటారా? అందుకే అంతా కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ హరీష్‌రావేనని అంటున్నారు. బీఆర్ఎస్‌లో కొనసాగాలంటే ఒదిగి ఉండాలి. తప్పులు ఎత్తి చూపడం.. రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేయడం వంటివి చేయకూడదని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్ తానా అంటే తందానా అంటేనే పార్టీలో మనుగడ అని ఆరోపణలున్నాయి.

ధైర్యంగా వేటు వేస్తారా?

వాస్తవానికి బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతమైతే దారుణంగా ఉంది. ఎప్పుడు పూర్వ వైభవం వస్తుందో కూడా తెలియదని పరిస్థితి. మరి ఇలాంటి తరుణంగా హరీష్‌రావుపై అంత ధైర్యంగా వేటు వేస్తారా? పార్టీ నుంచి బయటకు పంపించే సాహసం చేస్తారా? అనేది కూడా పెద్ద ప్రశ్న. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్‌ను లేపే ప్రయత్నమైతే చేశారు కానీ అది వర్కవుట్ కాలేదు. దీనికి తోడు ఆయన పార్టీని పార్లమెంట్, ఉప ఎన్నికల్లో గట్టెక్కించలేకపోవడం కూడా మైనస్. ఇలాంటి తరుణంలో పార్టీ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తేనే బాగుంటుందనేది పలువురు నేతల భావన. అయితే హరీష్ రావు పార్టీలో ఉంటే మాత్రం కేటీఆర్‌ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆయన నంబర్ 3 స్థానంలో నిలవడం కూడా కష్టమే. కాబట్టి హరీష్‌రావును ఉపేక్షిస్తారని ఎవరూ భావించడం లేదు.

పెద్ద కుట్రే..

అయితే తాజా పరిణామాలను చూసినా కూడా ఏదో తేడా కొడుతోంది సీనా అని అంతా మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు రెండో రోజే వాకౌట్ చేశారు. దీని వెనుక పెద్ద కుట్రే ఉందని టాక్. అసలు వాకౌట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆరా తీసిన జనాలు దీని వెనుక పెద్ద కుట్రే ఉందని అంటున్నారు. హరీష్‌రావుకు స్పీకర్ మైకు ఇవ్వకపోవడంతో కావాలనే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చి వాకౌట్ చేద్దామని తీసుకుని వెళ్లారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. కనీసం హరీష్ రావు ఆంతర్యం కూడా తెలుసుకునే యత్నం చేయలేదట. కేసీఆర్ ఆదేశాలను తూచ తప్పకుండా జగదీష్‌రెడ్డి ఫాలో అయ్యారని టాక్. ఒకవేళ సభలో హరీష్ ఉండి మాట్లాడితే ఆయనకు క్రెడిట్ దక్కుతుందని భయపడుతున్నారట. పైగా ప్రజల్లో హరీష్‌రావుకు వచ్చే ఇమేజ్‌ను అడ్డుకోవడం కోసమే ఇలా చేశారని టాక్.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 6, 2026 10:32 AM