Politics

Chandrababu-Pawan: భేటీ వెనుక బాలయ్య? లోగుట్టు అదేనా?

ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం, చిరు సోదరుడు పవన్ కల్యాణ్‌కు గుచ్చుకోలేదంటారా? పక్కాగా ఆయన మనసు నొచ్చుకునే ఉంటుంది.

Chandrababu-Pawan: భేటీ వెనుక బాలయ్య? లోగుట్టు అదేనా?

ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం, చిరు సోదరుడు పవన్ కల్యాణ్‌కు గుచ్చుకోలేదంటారా? పక్కాగా ఆయన మనసు నొచ్చుకునే ఉంటుంది. అన్నను దైవసమానంగా భావించే తమ్ముడాయన. కానీ బయటపడలేదు. చాలా హూందాగా వ్యవహరించారు. ఆ హూందాతనానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. మరి సీఎం చంద్రబాబు దానిని చూసిచూడనట్టు వదిలేశారంటారా? అలాంటి వ్యక్తిత్వమూ చంద్రబాబుది కాదు.. తాజాగా చంద్రబాబు, పవన్‌ల భేటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వాస్తవానికి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) దాదాపు వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్‌లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు (CM Chandrababu).. పవన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అయితే చంద్రబాబు (Chandrababu) పరామర్శ వెనుక కనిపించని మరో కారణం ఉందనే గుసగుసలు ఏపీలో గట్టిగానే వినిపిస్తున్నాయి. చంద్రబాబు అసెంబ్లీ (AP Assembly)లో ఎమ్మెల్యేల వైఖరిపై కలత చెంది ఇద్దరికి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అదే సమయంలో బాలయ్య వ్యాఖ్యలపై ఆయనసలు స్పందించిందే లేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యలను మాత్రం అసెంబ్లీ రికార్డుల (AP Assembly Records) నుంచి తొలగించారు.

కేవలం వ్యక్తిగత అంశాలేనా?

అసలు బాలయ్య వ్యాఖ్యలపై బయట పెద్ద రాద్దాంతమే జరిగింది. వైసీపీ (YSRCP) అనుకూల మీడియా దీనినొక భూతంలా చూపించింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సైతం ఈ వ్యాఖ్యలపై స్పందించడం.. వైసీపీ (YCP)కి మరింత అనుకూలంగా మారింది. ఈ క్రమంలోనే చంద్రబాబు.. పవన్‌ను ఆదివారం నాడు కలవడం రాజకీయం (Political)గా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కూడా చంద్రబాబుకు ఎదురెళ్లి మరీ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతల మధ్య చాలా సేపు చర్చ జరిగింది. ఈ చర్చలో ఏం జరిగిందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కేవలం వ్యక్తిగత అంశాలేనా? లేదంటే బాలయ్య ఎపిసోడ్ (Balayya Episode) ఏమైనా చర్చకు వచ్చిందా? అనే విషయమై బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఏ నేతైనా ఒక్క మాట మాట్లాడినా..

ఈ విషయంలో టీడీపీ (TDP), జనసేన (Janasena) అధినేతలను మెచ్చుకుని తీరాల్సిందే. ఈ ఎపిసోడ్ మొత్తంపై ఇరు పార్టీల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఎలాంటి కామెంట్ చేయకుండా కంట్రోల్ చేయగలిగారు. దీంతో పెను అరిష్టాన్ని అడ్డుకోగలిగారు. జనసేన నుంచి ఏ నేతైనా ఒక్క మాట మాట్లాడినా కూడా వైసీపీ దానిని అనుకూలంగా తీసుకుని నానా రాద్దాంతం చేసి ఉండేది. కానీ అంతా సైలెంట్‌గా ఉండటంతో వైసీపీ కొంతమేర రచ్చ చేసి సైలెంట్ అయిపోయింది. ముఖ్యంగా బాలయ్య వ్యాఖ్యల తర్వాత తొలిసారిగా.. చంద్రబాబు, పవన్ భేటీ (Chandrababu and Pawan Meeting) అవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పైకి కనిపిస్తున్నదైతే జ్వరంతో పవన్ బాధపడుతున్నారు కాబట్టి చంద్రబాబు పరామర్శించారు. ఇక లోగుట్టు అంటారా.. పెరుమాళ్లకే ఎరుక.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 29, 2025 4:08 AM