Politics

Nandamuri Balakrishna: సైకో.. చిరు.. నన్ను అవమానించారు.. ఏమిటిది బాలయ్య?

ఎవరు అవునన్నా.. కాదన్నా ఆయనో ప్రజా ప్రతినిధి.. పైగా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. ఆయనపై మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా అసెంబ్లీ సాక్షిగా..

Nandamuri Balakrishna: సైకో.. చిరు.. నన్ను అవమానించారు.. ఏమిటిది బాలయ్య?

ఎవరు అవునన్నా.. కాదన్నా ఆయనో ప్రజా ప్రతినిధి.. పైగా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి. ఆయనపై మనకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రస్తావన వస్తే గౌరవంగానే మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారకూడదు. కానీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం నోరు జారారు. అసలు ఏపీ అసెంబ్లీలో ఏం జరిగిందో తెలుసుకుందాం.

సినీ ప్రముఖులంతా గత ప్రభుత్వ హయాంలో వెళ్లి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)ని కలిసిన విషయం తెలిసిందే. నేడు (గురువారం) లా అండ్ ఆర్డర్‌పై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) మాట్లాడుతూ.. ఈ విషయాన్నిప్రస్తావించారు. అప్పట్లో జగన్ (Jagan) నివాసానికి రాజకీయాలతో సంబంధం లేని చిరంజీవి (Chiranjeevi), ప్రభాస్ (Prabhas), మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) వంటి సినీ ప్రముఖులను ఆహ్వానించారని.. వాళ్లు రామని చెప్పినా కూడా వినలేదని కామినేని వెల్లడించారు. ఆ తరువాత మొహమాటం కొద్దీ వస్తే.. ముందు పోసాని కృష్ణ మురళి వంటి వారు కూర్చొన్నారట. అప్పుడు మళ్లొక షాక్ ఇచ్చారని.. జగన్ కలవడానికి అవదన్నారని.. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నాని (Perni Nani)ని కలవాలని చెప్పారని కామినేని పేర్కొన్నారు. అప్పుడు చిరు (Chiru) ‘మీరు పిలిస్తే నేను వీళ్లందరినీ తీసుకొచ్చా’ అంటూ ఫైర్ అయ్యారని తెలిపారు. చిరు గట్టిగా అడిగిన మీదటే జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని కామినేని తెలిపారు.

ఎవడూ గట్టిగా అడగలే..

వాస్తవానికి అప్పట్లో ఇంత సీన్ అయితే జరగలేదు. కానీ అక్కడకు వెళ్లిన సినీ ప్రముఖులకు అవమానం జరిగిందనైతే వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే కామినేని అలా అన్నారో లేదో వెంటనే బాలయ్య (Nandamuri Balakrishna) లేచారు. కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. సినిమా వాళ్లు ఆ సైకో గాడిని కలిసేందుకు వెళ్లినప్పుడు... చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా అక్కడ ఎవడూ గట్టిగా అడగలేదన్నారు. అంతేకాకుండా ‘‘ఆయనేదో (చిరంజీవి) గట్టిగా అడిగితే వచ్చాడట.. సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నాడట. ఎవడడిగాడు గట్టిగా.. అడిగితే వచ్చాడా.. అడగటం ఏంటి..’’ అని బాలయ్య (Balayya) మాట్లాడారు. బాలయ్యకు చెయ్యే కాదు.. నోరు కూడా ఎక్కువే. పలు సందర్భాల్లో ఈ విషయం నిరూపితమైంది. అయినా సరే ఆయనలో మార్పేమీ లేదు.

అగౌరవంగా మాట్లాడితే ఎలా?

అసెంబ్లీ (AP Assembly) సాక్షిగా జగన్‌ను సైకోగాడు అని వ్యాఖ్యానించడమే తప్పు అంటే.. చిరు గురించి ఎవడూ గట్టిగా అడగలేదంటూ చిరును ఉద్దేశించి మాట్లాడటం దారుణం. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం (AP Government) అధికారంలో ఉంది. పైగా జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కు తన అన్నయ్య చిరు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా చెప్పాలంటే భక్తి. అలాంటి సమయంలో చిరు గురించి కూడా అలా అగౌరవంగా మాట్లాడితే ఎలా? ఈ ప్రభుత్వం తనను అవమానించిందని చెప్పడంలో తప్పులేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఫిలిం డెవలప్​మెంట్​ కార్పొరేషన్‌ (Film Devolepment Corporation)లో తన పేరు తొమ్మిదో స్థానంలో ముద్రించి అవమానించారన్నారు. ఆ విషయాన్ని తాను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను ప్రశ్నించినట్టు సైతం వెల్లడించారు. అంతా బాగానే ఉంది కానీ ఇలా బాలయ్య నోటికి పనిజెప్పడమే బాగోలేదు. మరి దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు కల్పించుకుని బాలయ్యను కంట్రోల్ చేస్తారో లేదో చూడాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 25, 2025 1:55 PM