Politics

Ayyannapatrudu: దళిత సంఘాలకు అయ్యన్న మద్దతు..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో అరాచకాలు, ఎంతోమంది అమాయకులు బలయ్యారు. వారిలో డాక్టర్ సుధాకర్ ఒకరు. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్, వైద్యులకు తగినంత పీపీఈ కిట్లు, మాస్క్‌లు లేవని ప్రభుత్వంపై అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నిరసనకు దిగారు.

Ayyannapatrudu: దళిత సంఘాలకు అయ్యన్న మద్దతు..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో అరాచకాలు, ఎంతోమంది అమాయకులు బలయ్యారు. వారిలో డాక్టర్ సుధాకర్ ఒకరు. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్, వైద్యులకు తగినంత పీపీఈ కిట్లు, మాస్క్‌లు లేవని ప్రభుత్వంపై అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నిరసనకు దిగారు. దీంతో ఆయన జగన్‌కు విరోధిగా మారారు. దళిత డాక్టర్ అవడంతో ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా మానసికంగా హింసించారు. పిచ్చోడనే ముద్ర వేసి మానసిక ఆసుపత్రికి తరలించారు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే అప్పటి ఎమ్మెల్యే గణేష్ అయితే మరో అడుగు ముందుకేశారు.

సుధాకర్‌ను తన ఇంటికి పిలిపించి ఒక డాక్టర్ అనే కనికరం కూడా లేకుండా హింసించి లెటర్ రాయించుకున్నారు. దీనికి సంబంధించిన సంచలన వీడియోను దళిత సంఘాలు విడుదల చేశాయి. ఈ విషయాన్ని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేశారు. సుధాకర్ విషయమై తక్షణమే స్పందించిన చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. ఆయన కుటుంబాన్ని పరామర్శించి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించారు. సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 5, 2026 2:19 AM