others

Biryani: డిసెంబర్ 31 నాటి రాత్రి ఇండియన్స్ ఎన్ని బిర్యానీలు ఆర్డర్ చేశారో తెలిస్తే..

నూతన సంవత్సర వేడుకలను ఇండియన్స్ కూడా అత్యంత లగ్జరీగా జరుపుకున్నారు. 2026కు ఓ రికార్డ్‌తో భారతీయులంతా స్వాగతం పలికారు. అద మరేదో కాదండోయ్.. బిర్యానీ రికార్డ్. ఆన్‌లైన్‌లో తమకు ఇష్టమైన బిర్యానీలను బీభత్సంగా తెప్పించుకుని లాగించేశారు.

Biryani: డిసెంబర్ 31 నాటి రాత్రి ఇండియన్స్ ఎన్ని బిర్యానీలు ఆర్డర్ చేశారో తెలిస్తే..

నూతన సంవత్సర వేడుకలను ఇండియన్స్ కూడా అత్యంత లగ్జరీగా జరుపుకున్నారు. 2026కు ఓ రికార్డ్‌తో భారతీయులంతా స్వాగతం పలికారు. అద మరేదో కాదండోయ్.. బిర్యానీ రికార్డ్. ఆన్‌లైన్‌లో తమకు ఇష్టమైన బిర్యానీలను బీభత్సంగా తెప్పించుకుని లాగించేశారు. కేవలం బుధవారం ఒక్కరోజే నిమిషానికి ఆన్‌లైన్‌లో 1,336 బిర్యానీలు ఆర్డర్ చేసి భారతీయులంతా రికార్డ్ సృష్టించారు. స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడించింది. మనోళ్లు డిసెంబర్​ 31 రాత్రి 8 గంటలకే స్విగ్గీలో ఆర్డర్లు పెట్టడం మొదలు పెట్టారు. ఆ సమయంలోనే నిమిషానికి సగటున 1,336 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ వెల్లడిచింది.

ఇదే విశేషం అనుకుంటే అంతకు మించిన విశేషం మరొకటి ఉంది. అదేంటంటే.. డిసెంబర్ 31 రాత్రి 7.30 గంటలకే ఏకంగా 2,18,993 బిర్యానీలు ఆర్డర్స్​ రాగా.. అందులో భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యక్తిది స్పెషల్ ఆర్డర్. తన మిత్రులకు పార్టీ ఇవ్వడం కోసం ఏకంగా 16 కిలోల బిర్యానీని ఒకే ఆర్డర్​లో ఇచ్చాడు. మొత్తంగా భారతీయులంతా 2025 మొత్తంలో ఏకంగా 93 మిలియన్ బిర్యానీలు ఆర్డర్ చేసినట్టుగా స్విగ్గీ తెలిపింది. ఇక సెకన్ల లెక్కన చూసుకుంటే.. సగటున ప్రతి సెకెన్‌కు 3.25 ఆర్డర్లు వచ్చాయన్నమాట. బిర్యానీ మాత్రమే కాదండోయ్.. ఇయర్ ఎండ్ వేడుకల్లో బిర్యానీకి పిజ్జా, బర్గర్లు గట్టి పోటీ ఇచ్చాయి. రాత్రి 8.30 గంటల నాటికి 2.10 లక్షలకు పైగా పిజ్జాలు.. 2.16 లక్షలకు పైగా బర్గర్లు డెలివరీ చేసినట్టు స్విగ్గీ వెల్లడించింది.

ఇక స్వీట్స్ విషయానికి వస్తే.. డిసెంబర్ 31 నాటి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రస్‌మలై, గజర హల్వా, గులాబ్​ జమూన్ లాంటి స్వీట్స్ పెద్ద ఎత్తున ఆర్డర్ పెట్టినట్టుగా స్విగ్గీ వెల్లడించింది. ఇక సూరత్‌కు చెందిన ఓ వ్యక్తి అయితే డిసెంబర్ 31న రాత్రి 22 వేర్వేరు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడట. స్విగ్గీ నుంచే ఈ స్థాయిలో అయితే జొమాటో, బ్లింకిట్‌ల నుంచి ఎన్ని రికార్డులు వెళ్లి ఉండొచ్చు? మొత్తంగా ఈ రెండు సంస్థలకు డిసెంబర్ 31న రాత్రి 75 లక్షల ఆర్డర్లను సప్లై చేసిందట. 63 లక్షల కస్టమర్లకు ఈ ఆర్డర్లను అందజేసినట్టు ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మొత్తం 4.5 లక్షల మందికిపైగా తమ సంస్థ నుంచి డెలివరీస్ అందజేసినట్టు దీపిందర్ వెల్లడించారు

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 2, 2026 2:29 AM