Vinayaka Laddu: వామ్మో.. ఈ గణేశుడి లడ్డూ ధరతో రెండు కేజీల బంగారం కొనొచ్చు..
ఇంతకు మించి లడ్డూ వేలం ఉండదా? అంటే ఉంటుంది. అది కూడా మరెక్కడో కాదు.. హైదరాబాద్‌లోనే. బాలాపూర్ లడ్డూని మరుసటి ఏడాది బాలపూరే బీట్ చేస్తూ ఉంటుందని చెబుతారు కానీ

వినాయక నిమజ్జనం (Vinayaka Immersion) అనగానే మనకు గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డు (Balapur Laddu). ఇది ఎంత ధరకు అమ్ముడు పోతుందనేది సర్వత్రా ఆసక్తి. ముందు రోజు నుంచే వినాయకుడి లడ్డూ ధర ఎంత పలుకుతుందనే ఆసక్తి భక్తుల్లో నెలకొంటుంది. ఈ లడ్డూ వేలాన్ని వీక్షేందుకు బాలాపూర్ ప్రాంత వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. కానీ ఇంతకు మించి లడ్డూ వేలం ఉండదా? అంటే ఉంటుంది. అది కూడా మరెక్కడో కాదు.. హైదరాబాద్ (Hyderabad)లోనే. బాలాపూర్ (Balapur) లడ్డూని మరుసటి ఏడాది బాలపూరే బీట్ చేస్తూ ఉంటుందని చెబుతారు కానీ ఇక్కడ కోట్ల రూపాయల్లో లడ్డూ వేలం జరిగినా ఎందుకోగానీ హైలైట్ అవదు. అది మరెక్కడో కాదు.. బండ్లగూడ (Bandlaguda) జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాలో.. ఇక్కడ గత ఏడాది దాదాపు రెండు కోట్లు లడ్డూ ధర పలకగా.. ఈ ఏడాది అది దాదాపు రెండున్నర కోట్లకు చేరింది. గతేడాది కమ్యూనిటీలో లడ్డూ ధర రూ.1.87 కోట్లు పలకగా.. ఈ ఏడాది నిన్న (శుక్రవారం) నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.2,31,95,000 పైగా చెల్లించి లడ్డూని కీర్తి రిచ్మండ్ విల్లా వాసులు దక్కించుకున్నారు. ఇప్పుడు చెప్పండి.. రూ.2,31,95,000తో రెండు కేజీ బంగారం (Gold) కొనొచ్చా.. లేదా?
ప్రజావాణి చీదిరాల