Gold Price: వామ్మో.. ఇది మామూలు షాకింగ్ న్యూస్ కాదు.. రూ.2లక్షలకు బంగారం ధర..
వామ్మో.. ఏంటిది? బంగారం (Gold) భగ భగ.. గట్టెక్కింది.. కొండెక్కింది.. అన్నీ అయిపోయాయి. దీనికి టైటిల్ ఏం పెట్టాలో కూడా తెలియట్లే. బంగారం ధర వింటేనే మైండ్ బ్లాక్.. రెడ్, వైట్ అన్నీ అవడం ఖాయం.

వామ్మో.. ఏంటిది? బంగారం (Gold) భగ భగ.. గట్టెక్కింది.. కొండెక్కింది.. అన్నీ అయిపోయాయి. దీనికి టైటిల్ ఏం పెట్టాలో కూడా తెలియట్లే. బంగారం ధర వింటేనే మైండ్ బ్లాక్.. రెడ్, వైట్ అన్నీ అవడం ఖాయం. ఇది మామూలు షాకింగ్ న్యూస్ కదా.. బంగారం ధర (Gold Price) రూ. లక్షకు చేరిందంటేనే నోరు వెళ్లబెట్టాం. ఇప్పుడు రూ.2 లక్షలకు చేరబోతోందంటే ఏకంగా కోమా స్టేజేనేమో.. ఇంతకీ బంగారం రూ.2 లక్షలకు ఎప్పుడు చేరబోతోందో తెలుసా? అది ఎప్పుడనేది క్లారిటీ అయితే లేదు కానీ త్వరలోనే ఈ తరుణమైతే రాబోతోంది. దీనికి కారణం డాలర్ (Dollar)పై నమ్మకం తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. డాలర్ నోట్లను అయితే అమెరికా (America) భారీగానే ముద్రిస్తోంది కానీ దాని విలువను నిలబెట్టుకోవడంలోనే విఫలమవుతోంది.
మొత్తానికి బంగారం అయితే పెట్టుబడి (Investment on Gold)కి ప్రధాన వనరుగా మారిపోయిందనడంలో సందేహం లేదు. రాబోయే రెండేళ్లలో ఎప్పుడైనా బంగారం ధర రూ.2 లక్షలకు చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఏడాది క్రితం బంగారం ధర ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడికి ఎగబాకింది? కేవలం ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ అంటే 9 నెలల్లో బంగారం ధర రూ.30 వేలకు పైనే పెరిగింది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే రూ.2 లక్షలకు చేరుకునేందుకు పెద్దగా సమయం పట్టదు. ప్రస్తుతం (Gold Rate Today) ఆర్నమెంట్ బంగారం (Ornament Gold) అంటే 22 క్యారెట్ల తులం బంగారం రూ. 1,08,450గా ఉంది. ఇక 24 క్యారెట్లు అయితే రూ. 1,18,310గా ఉంది. లక్ష రూపాయలంటేనే జనం నోరెళ్లబెట్టారు. ఇప్పుడు మరో రూ.8 వేలకు పైనే పెరిగింది. ఇక ముందు ఎలా ఉంటుందో చూడాలి.