others

Biggboss 9: వీళ్లిక మారరా? విసుగు తెప్పిస్తున్న కామనర్స్..

ఫుటేజ్ కోసం చూసుకుంటున్నారో మరొకటో కానీ ఇద్దరూ ఇద్దరే. మాట్లాడే తీరు కనీసం చదువురాని వారికన్నా అధ్వాన్నం. చదువు రానివారే చాలా జాగ్రత్తగా, మర్యాదగా మాట్లాడతారు.

Biggboss 9: వీళ్లిక మారరా? విసుగు తెప్పిస్తున్న కామనర్స్..

బిగ్‌బాస్ (Biggboss) సీజన్ 9 తెలుగు (Biggboss Season 9 Telugu)ను రసవత్తరంగా మార్చడం కోసం కొందరు కామనర్స్‌ (Commoners)ని.. కొందరు సెలబ్రిటీల (Celebrities)ను తీసుకుని నిర్వాహకులు హౌస్‌లోకి పంపించారు. తొలివారం శ్రష్టీవర్మ (Srashti Varma) ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఇక కామనర్స్ విషయానికి వస్తే ఎవరికి వారే యమునా తీరే. ఏదో అందరూ కలిసి ఆడుతున్నట్టు అనిపించినా కూడా ఒకరితో ఒకరు అస్సలు కలవరు.

కామనర్స్‌లో ప్రియా శెట్టి (Priya Shetty), శ్రీజ దమ్ము (Srija Dammu) ఇద్దరూ మూకుమ్మడిగా ఎవరి మీద పడితే వారి మీద నోరేసుకుని పడిపోతున్నారు. ఫుటేజ్ కోసం చూసుకుంటున్నారో మరొకటో కానీ ఇద్దరూ ఇద్దరే. మాట్లాడే తీరు కనీసం చదువురాని వారికన్నా అధ్వాన్నం. చదువు రానివారే చాలా జాగ్రత్తగా, మర్యాదగా మాట్లాడతారు. వీళ్లిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మర్యాద మనీష్ (Maryada Manish).. తన గురించి తాను ఇచ్చుకున్నంత ఎలివేషన్ ఎవ్వరూ ఇవ్వరేమో.. ఇచ్చుకుంటే ఇచ్చుకున్నాడులే కానీ నామినేషన్స్‌ (Nominations)లో అతని తీరు మరీ దారుణం. భరణి (Actor Bharani)ని అతను మాట్లాడిన విధానం చూస్తే ఎవరూ హర్షించరు. తనకు తాను ఏదో ఊహించుకుని భరణిపై అంతెత్తు లేచాడు. ఏవేవో మాటలు వదిలాడు. మరి అంత తప్పే భరణి చేసి ఉంటే వీకెండ్స్‌లో హెస్ట్ నాగార్జున (Nagarjuna) అడిగి ఉండేవారు కదా.. ఈ విషయం కూడా తెలియలేదతనికి. మరీ దారుణంగా ఉన్నాడు.

ఇక హరిత హరీష్ (Haritha Harish).. అతనికి ఎవరి మీద కోపమో అర్థం కాదు.. ఫుడ్ మానేసి స్ట్రైక్ మొదలు పెట్టాడు. తను మాట్లాడిన మాటలే చూసి కూడా తనలా మాట్లాడలేదంటాడు. ముగ్గురు లేడీస్‌తో ఆడానని తనకు తెలియలేదని మాట్లాడి.. తన మాటలకు అర్థం అది కాదంటాడు. అసలు ఆ మాటలు ఎవరైనా పాజిటివ్‌గా తీసుకునేలా ఉన్నాయా? రెడ్ ఫ్లవర్ అనే మాట కూడా అంతే. పోనీ ఆ సమయంలో అంతా సరదాగా ఉన్నారు కాబట్టి అన్నాడకున్నా.. దానిని చెప్పేస్తే అయిపోతుంది. కానీ దానిని కూడా సమర్థించుకుంటాడు. తనకు జెండర్ డిఫరెన్స్ (Gender Difference) లేదన్నట్టుగా మాట్లాడతాడు. అంతలోనే.. ఒక మగాడ్ని ఫుడ్ విషయంలో నన్ను అలా చేస్తారా.. ఇలా చేస్తారా? అంటూ రెచ్చిపోతాడు. మగాడినన్న అహంకారం అతని నరనరాల్లో పాతుకుపోయినట్టుగా అనిపిస్తుంది అతని మాటల్లో.. ఇక పవన్ కల్యాణ్ (Pawan Kalyan), డిమాన్ పవన్ వీరితో పోలిస్తే కాస్త బెటర్ అని అనిపిస్తున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 16, 2025 3:29 PM