others

Biggboss9: హౌస్‌లోకి వెళ్లి ఆ కంటెస్టెంట్స్‌ని ఉతికి ఆరేసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కామనర్స్..

ఒకవేళ కామనర్స్‌తో ప్రస్తుతం వైల్డ్ కార్డ్‌ ద్వారా వెళ్లినవాళ్లు డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేశారంటే బయట తమకు నెగిటివిటీ ఉందని వారు అర్థం చేసుకుని బాగా ఆడతారనే ఆలోచన కూడా అయ్యుండొచ్చు.

Biggboss9: హౌస్‌లోకి వెళ్లి ఆ కంటెస్టెంట్స్‌ని ఉతికి ఆరేసిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కామనర్స్..

ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో ఐదుగురు కామనర్స్ (Biggboss Commoners) ఉన్నారు. ఒకరు బయటకు వచ్చేశారు. ఇక ఉన్న ఐదుగురిపై కూడా బయట నెగిటివిటీ బీభత్సంగా ఉంది. ఈ క్రమంలోనే అగ్నిపరీక్ష (Biggboss Agnipariksha)లో టాప్ 15లో మంచి ప్రతిభ కనబరిచిన నలుగురిని వైల్డ్ కార్డ్స్‌‌గా హౌస్‌లోకి పంపించారు. హౌస్‌లోకి వచ్చిన వారిలో దివ్య నిఖిత (Divya Nikhitha), షాకిబ్ (Shakib), నాగ ప్రశాంత్ (Naga Prashanth), అనూషా రత్నం (Anusha Rathnam). ఈ నలుగురు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో (Biggboss Promo) బయటకు వచ్చింది. సీజన్ వచ్చేసి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ (Commoners Vs Celebrities). ఆసక్తికరంగా సెలబ్రిటీలలో రీతూ చౌదరి (Rithu Chowdary)పై భయంకరమైన నెగిటివిటీ ఉంది. మిగిలిన వారిపై నెగిటివిటీ అంటూ ఏమీ లేదు. కానీ కామనర్స్ అందరిపై నెగిటివిటీ ఉంది. ఇప్పుడు మరో నలుగురు కామనర్స్‌ని హౌస్‌లోకి పంపిస్తే కాస్త కామనర్స్‌కి వెయిట్ పెరుగుతుంది.

పైగా వీరు చక్కగా ఆడితే షో బాగా పండుతుంది. ఒకవేళ కామనర్స్‌తో ప్రస్తుతం వైల్డ్ కార్డ్‌ ద్వారా వెళ్లినవాళ్లు డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేశారంటే బయట తమకు నెగిటివిటీ ఉందని వారు అర్థం చేసుకుని బాగా ఆడతారనే ఆలోచన కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లిన నలుగురిలో ఇద్దరు హౌస్‌లోకి వెళతారనేది టాక్. వీళ్లు హౌస్‌లోకి రాగానే ఓటు అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే కామనర్స్‌తో గట్టిగానే కొత్తగా వచ్చిన కామనర్స్‌కి పడింది. షాకిబ్ అయితే తాను పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో స్వాబ్ చేసుకుంటానని చెప్పాడు. బిగ్‌బాస్ హౌస్‌కి మనం ఎందుకొచ్చామో తెలుసుకోవాలంటూ గట్టిగానే ఇచ్చి పడేశాడు. మొత్తానికి ఇది రసవత్తరంగా కొనసాగింది. గత సీజన్‌లో సీత, సోనియా తదితరులు ఎలిమినేట్ అయిపోయాక వచ్చారే అలా వీళ్లు కూడా వచ్చి కూర్చొని హౌస్‌లోని కామనర్స్‌తో వాదనకు దిగారు.

ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం.. హౌస్‌లోకి దివ్య నికిత (Divya Nikitha), షాకిబ్ ఉన్నట్టుగా సమాచారం. వీరంతా ఓటు అప్పీల్ చేసుకుని బయటకు వచ్చేస్తారట. మరి హౌస్‌మేట్స్ ఎవరికి ఓటు వేస్తారో చూడాలి. అలా ఓటు వేసిన వారిలో టాప్‌లో ఎవరుంటే వారిని హౌస్‌లోకి వీకెండ్‌లో నాగార్జున వారి ప్రోమో ప్లే చేసి హౌస్‌లోకి పంపిస్తారని సమాచారం. ఇక సెలబ్రిటీల నుంచి నటి ప్రియాంక జైన్ (Actress Priyanka Jain) ప్రియుడు, నటుడు శివ్ (Actor Shiv) వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడని సమాచారం. మొత్తానికి ఈ షోను రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ అయితే గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 25, 2025 10:49 AM