CPI Narayana: ఒకవేళ మీకు కనుక బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా..
తెలుగు బిగ్‌బాస్ హౌస్ (Telugu Biggboss House)ను వ్యభిచార కొంపగా సీపీఐ నారాయణ (CPI Narayana) అభివర్ణించారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Biggboss Telugu Reality Show)పై ఆయన ఎప్పటి నుంచో పోరాటం సాగిస్తూనే ఉన్నారు.

తెలుగు బిగ్‌బాస్ హౌస్ (Telugu Biggboss House)ను వ్యభిచార కొంపగా సీపీఐ నారాయణ (CPI Narayana) అభివర్ణించారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Biggboss Telugu Reality Show)పై ఆయన ఎప్పటి నుంచో పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఈ షో నిలిపివేయాలని.. అది జనాలపై చెడు ప్రభావాన్ని కలిగిస్తోందంటూ అవకాశం దొరికినప్పుడల్లా మండిపడుతుంటారు. తాజాగా ఈ షోపై కేసు కూడా నమోదైంది. ఎవరు ఏం చేసినా షో (Biggboss Show) మాత్రం ఆగదనడంలో సందేహమే లేదు. అయితే తాజాగా మరోసారి బిగ్‌బాస్ షోపై సీపీఐ నారాయణ నోటికి పని చెప్పారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణకు ‘ఒకవేళ మీకు కనుక బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వస్తే, దానిని సరి చేయడానికి వెళతారా?’ అనే ప్రశ్న ఎదురైంది. బయట నుంచి దానిపై ఫైట్ చేస్తాను తప్పితే.. లోపలికి వెళ్లి ఏం చేస్తామంటూ ఆయన ప్రశ్నించారు.
‘బిగ్‌బాస్ అనేదే ఒక వ్యభిచార కొంప అయితే.. దానిలోకి వెళ్లి కాపురం చేయమంటారేంటి?’ అంటూ నారాయణ తిరిగి ప్రశ్నించారు. దానిపై బయట నుంచే ఫైట్ చేస్తా కానీ లోపలికి వెళ్లేదే లేదన్నారు. ఆ కొంపే అలాంటి కొంప అయితే దానిని సంసారపక్షం చేసేందుకు ఎలా సాధ్యమవుతుందన్నారు. బయట నుంచే దానిని సంస్కరించాలన్నారు. అందులోకి వెళితే మనం కూడా అందులో కలిసిపోతామని.. ఆ సిస్టమ్ వేరని.. చెడు సంప్రదాయానికి వేదిక అని అన్నారు. దానిలో ఉండేవారెవరూ బంధువులు కాదన్నారు. కొత్తవాళ్లని అందునా పెళ్లి కాని యూత్‌ని అందులోకి తీసుకెళ్లి 100 రోజుల పాటు తిండి పెట్టి అక్కడే తిని తిరగమంటే దానిని ఏమనాలంటూ ప్రశ్నించారు. అదేమంటే సోషల్ బిహేవియర్ అంటారని.. అదొక పాశ్చాత్య పోకడ అని సీపీఐ నారాయణ అన్నారు.