Whatsapp: త్వరలోనే అందుబాటులోకి వాట్సాప్ సరికొత్త ఫీచర్..
ఉదయం లేచీ లేవగానే గతంలో అయితే పేపర్ లేదంటే కాఫీ పడితే ఉదయం అంతా ప్రశాంతంగా ఉండేది. కాఫీ అనేది ఒక బిగ్ అడిక్షన్ అని చెబుతారు. అంతకు మించిన అడిక్షన్‌లా వాట్సాప్ మారిపోయింది. ఉదయం కళ్లు విప్పడంతోనే చేసే మొదటి పని వాట్సాప్ చూడటం.
ఉదయం లేచీ లేవగానే గతంలో అయితే పేపర్ లేదంటే కాఫీ పడితే ఉదయం అంతా ప్రశాంతంగా ఉండేది. కాఫీ అనేది ఒక బిగ్ అడిక్షన్ అని చెబుతారు. అంతకు మించిన అడిక్షన్‌లా వాట్సాప్ మారిపోయింది. ఉదయం కళ్లు విప్పడంతోనే చేసే మొదటి పని వాట్సాప్ చూడటం. ఇక వాట్సాప్ కూడా నెలకో కొత్త ఫీచర్‌తో జనాలను కట్టిపడేస్తోంది. తాజాగా తన వినియోగదారుల డేటా భద్రత కోసం మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
పొరపాటున మనం ఎవరికైనా మెసేజ్ పంపిస్తే లేదంటే అత్యంత రహస్యమైన మెసేజ్ పంపినప్పుడు దానిని వారు చూడగానే డిలీట్ చేయాలని అనుకుంటాం. ఒక్కోసారి మరిచిపోతాం. అలాంటి వారికోసమే ఈ కొత్త ఫీచర్. పంపిన మెసేజ్‌లు 24 గంటల్లో డిలీట్ అయ్యేలా ఆప్షన్ అయితే ఇప్పటికే ఉంది. కానీ ఇక మీదట.. ఆ సమయం మరింత తగ్గనుంది. ఒక మెసేజ్ అత్యంత రహస్యమైనదనుకుంటే 15 నిమిషాల్లో డిలీట్ అయ్యేలా ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. దీని ప్రకారం మెసేజ్ చేసిన 15 నిమిషాల్లో మెసేజ్ డిలీట్ కానుంది.
ముఖ్యంగా ఈ ఫీచర్ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు లేదా పాస్‌వర్డ్‌లు వంటి సున్నితమైన సమాచారాన్నిషేర్ చేసేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటివి పంపిస్తాం కానీ కొన్ని సందర్భాల్లో పనుల్లో పడి డిలీట్ చేయడం మరచిపోతూ ఉంటాం. ఒకవేళ అవతలి వారి ఫోన్ హ్యాక్ అవడమో.. లేదంటే రిపేర్ కోసం ఇవ్వడమో చేసినప్పుడు ఆ సమాచారం మూడో వ్యక్తి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని పంపించిన సమయంలో 15 నిమిషాల ఆటో-డిలీట్ ఆప్షన్ వినియోగించుకోవచ్చు. అలా చేస్తే ఆ సమాచారం దానంతట అదే 15 నిమిషాల తర్వాత మాయమైపోయి మనకు పూర్తి భద్రతనిస్తుంది.
అయితే ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ మోడ్‌లోనే ఉంది. ప్రస్తుతం దీనిని కొంత మంది బీటా యూజర్లకు టెస్ట్ కోసం అందుబాటులో ఉంచారు. అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాత.. అంతా ఓకే అనుకుంటే వినియోగదారులందరికీ 15 నిమిషాల ఆటో-డిలీట్ ఆప్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ‘డిసప్పియరింగ్ మెసేజెస్’ ఆప్షన్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌కు ఇది ఒక అప్‌గ్రేడ్ వెర్షన్‌గా చెబుతారు. వాట్సాప్ తీసుకువస్తున్న ఈ 15 నిమిషాల డిలీట్ ఫీచర్ డిజిటల్ వినియోగదారుడి ప్రైవసీకి ఎంతగానో ఉపయోగపడనుంది. మరి ఎప్పుడు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందో చూడాలి.