others

Ajith Pawar: విమాన ప్రమాదంలో పైలెట్ చివరిగా ఏం మాట్లాడారంటే..

మహారాష్ట్రలోని బారామతిలో ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిష్టర్ అజిత్ పవార్ (Ajit Pawar Plane Crash) మరణించిన విషయం తెలిసింది. అయితే ప్రమాదం (Plane Crash) జరుగబోతోందన్న విషయాన్ని పైలెట్లు చివరి క్షణంలోనే గుర్తించారు.

Ajith Pawar: విమాన ప్రమాదంలో పైలెట్ చివరిగా ఏం మాట్లాడారంటే..

మహారాష్ట్రలోని బారామతిలో ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిష్టర్ అజిత్ పవార్ (Ajit Pawar Plane Crash) మరణించిన విషయం తెలిసింది. అయితే ప్రమాదం (Plane Crash) జరుగబోతోందన్న విషయాన్ని పైలెట్లు చివరి క్షణంలోనే గుర్తించారు. ఆ సమయంలో పైలెట్ ఏం మాట్లాడారు? అనేది తెలిసింది. చివరి క్షణంలో పైలట్లు ప్రమాదాన్ని గమనించిన వెంటనే ‘ఓహ్‌ షి’ అన్నట్టుగా రికార్డును బట్టి తెలుస్తోంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రమాదం గుర్తించడంతోనే పరిస్థితి చేజారిపోయింది. దీంతో మరో మాట కూడా పైలెట్లు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది.

క్షణాల్లోనే విమానంలో ఉన్నవారంతా విగతజీవులుగా మారారు. డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారి ఈ ఘటన గురించి వివరించారు. ఈ క్రమంలోనే కాక్‌పిట్‌లో పైలెట్ వరి మాటల గురించి వెల్లడించారు. ప్రమాద ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) ఈ దర్యాప్తును చేపట్టింది. ఫ్లైట్‌ రికార్డర్‌గా పిలిచే బ్లాక్‌ బాక్స్‌ను విశ్లేషిస్తోంది. బ్లాక్ బాక్స్ అనేది విమాన ప్రయాణం గురించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే కీలక పరికరం. ప్రయాణ సమాచారాన్ని మాత్రమే కాకుండా అది కూలడానికి ముందు కాక్‌పిట్‌లో జరిగిన సంభాషణలు, అక్కడి నుంచి వెలువడిన శబ్దాలను సైతం బ్లాక్ బాక్స్ నమోదు చేస్తుంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 29, 2026 5:56 AM