others

ఆస్ట్రేలియాలో భారీ జీతంతో వెల్డర్ ఉద్యోగాలు..

విదేశాల్లో స్థిరపడాలి, సమాజంలో మంచి గౌరవంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలనేది ఎంతో మంది కల. అయితే దానికి మార్గం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మంచి నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇది ఒక సువర్ణావకాశం.

ఆస్ట్రేలియాలో భారీ జీతంతో వెల్డర్ ఉద్యోగాలు..

విదేశాల్లో స్థిరపడాలి, సమాజంలో మంచి గౌరవంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలనేది ఎంతో మంది కల. అయితే దానికి మార్గం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మంచి నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇది ఒక సువర్ణావకాశం. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఒక అద్భుతమైన ఆఫర్‌ ఇస్తోంది. ఆస్ట్రేలియాలో వెల్డర్ల నియామకం కోసం అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ వృత్తి నిపుణులకు అత్యంత డిమాండ్ ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ అభ్యర్థులకు ఈ భారీ ఆఫర్‌ను అందిస్తోంది.

జీతం వివరాలు..

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఇచ్చిన నోటిఫికేషన్‌లో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధానాంశం జీతం. దీనికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ వేతనం లభించనుంది. మంచి నైపుణ్యం ఉన్నవారికి ఆస్ట్రేలియాలోని నిర్మాణ, మైనింగ్, మెటల్ ఫ్యాబ్రికేషన్ రంగాల్లో వెల్డర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగానే.. సంస్థలు భారీ ప్యాకేజీని ఆఫర్ చేస్తున్నాయి. జీతం మాత్రమే కాదు.. మరో ప్లస్ కూడా ఉంది. అదేంటంటే.. అంతర్జాతీయ స్థాయిలో పని అనుభవం గడించడం వల్ల భవిష్యత్తులో ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లేందుకు బలమైన కెరీర్‌కు పునాది పడుతుంది.

అర్హతలు:

ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే కేవలం పని తెలిసి ఉండటంతో పాటు ప్రాథమిక అర్హతలు తప్పనిసరి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ (ITI) లేదా వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్, మెకానికల్ విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వెల్డింగ్‌ రంగంలో కనీసం 5 నుండి 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. ముఖ్యంగా భారీ పరిశ్రమలు లేదా ప్రాజెక్టులలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక వయసు విషయానికి వస్తే.. దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల వయస్సు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆస్ట్రేలియాలో నివసించాల్సి ఉన్నందున ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం తెలిసి ఉండటంతో పాటు అంతర్జాతీయ ఆంగ్ల భాషా పరీక్ష (IELTS)లో కనీసం 5 స్కోర్ సాధించి ఉండటం తప్పనిసరి.

సాంకేతిక నైపుణ్యాలు (Technical Skills):

వెల్డింగ్ రకాలు: MIG (Metal Inert Gas), TIG (Tungsten Inert Gas), ARC, Stick వెల్డింగ్‌లో నిపుణులై ఉండాలి.

డ్రాయింగ్ రీడింగ్: ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ డ్రాయింగ్స్‌ను క్షుణ్ణంగా చదివి, ఆ ప్లాన్ ప్రకారం పనిని అమలు చేయగలగాలి.

ఫ్యాబ్రికేషన్ స్కిల్స్: మెటల్ కటింగ్, గ్రైండింగ్, ఫ్యాబ్రికేషన్ పనులలో వేగం, ఖచ్చితత్వం ఉండాలి.

నాణ్యత అండ్ భద్రత: క్వాలిటీ ఇన్‌స్పెక్షన్ చేయగలగాలి. అన్నిటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను (Safety Norms) ఖచ్చితంగా పాటించాలి.

దరఖాస్తు విధానం (Application Process)..

అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్‌డేటెడ్ రెజ్యూమ్‌ను (Resume/CV) ను tomcom.resume@gmail.com ఈమెయిల్ అడ్రస్‌కు పంపాలి. మీ రెజ్యూమ్‌లో మీ అనుభవంతో పాటు చేసిన ప్రాజెక్టుల వివరాలను స్పష్టంగా తెలియజేయాలి.

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:

ఏవైనా సందేహాలు ఉన్నా లేదా అప్లికేషన్ ప్రాసెస్ గురించి మరింత సమాచారం కావాలన్నా కింది నంబర్లకు కాల్ చేయవచ్చు:

+91 94400 51285

+91 94400 51452

టామ్‌కమ్ (TOMCOM) అనేది తెలంగాణ ప్రభుత్వ సంస్థ. కాబట్టి ప్రైవేట్ ఏజెంట్ల వద్ద మోసపోయే అవకాశమే ఉండదు. నేరుగా ప్రభుత్వ మార్గదర్శకత్వంలో విదేశాలకు వెళ్లేందుకు ఇదొక సురక్షితమైన మార్గం. వెల్డింగ్ వృత్తిలో ఉండి, జీవితంలో ఎదగాలనుకునే వారికి ఈ సమాచారాన్ని వెంటనే షేర్ చేయండి. సరైన నైపుణ్యం, భాషా జ్ఞానం ఉన్నవారికి ఆస్ట్రేలియా వీసా లభించడం ఇప్పుడు మరింత సులభం.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 16, 2026 12:05 PM