others

Biggboss 9: బిగ్‌బాస్ నుంచి ఈసారి కూడా ఊహించని ఎలిమినేషన్

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఎలిమినేషన్ (Biggboss Elimination) సమయం వచ్చేసింది. గత వారం బిగ్‌బాస్ హౌస్ (Biggboss House) నుంచి ఎవ్వరూ ఊహించని ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది.

Biggboss 9: బిగ్‌బాస్ నుంచి ఈసారి కూడా ఊహించని ఎలిమినేషన్

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఎలిమినేషన్ (Biggboss Elimination) సమయం వచ్చేసింది. గత వారం బిగ్‌బాస్ హౌస్ (Biggboss House) నుంచి ఎవ్వరూ ఊహించని ఎలిమినేషన్ జరిగిందని తెలుస్తోంది. శ్రీజ (Srija) హౌస్ నుంచి వెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఈవారం కూడా అలాంటి ఎలిమినేషనే జరిగింది. ఓటింగ్ పరంగా ఈ వారమంతా టాప్ 3లో ఉన్న వ్యక్తి సడెన్‌గా హౌస్ నుంచి ఎలిమినేట్ అవడం.. పాత కంటెస్టెంట్స్ అంతా కన్నీటి పర్యంతమవడం జరిగిపోయాయి. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరంటారా? భరణి (Bharani). ఈయనకు సంబంధించి ఆట కన్నా ఎక్కువగా బంధాలే కనిపించాయి. వాస్తవానికి చెప్పాలంటే బెడ్ టాస్క్‌లో శ్రీజను సడెన్‌గా బెడ్ మీద నుంచి తోసేసినప్పటి నుంచి ఆయనకు నెగిటివిటీ ప్రారంభమైంది.

అంతకు ముందు ఆయనపై నెగిటివిటీ అయితే లేదనే చెప్పాలి. పైగా భరణి తన గురించి తాను అతిగా ఊహించుకోవడం కూడా దెబ్బకొట్టింది. తనతో పెట్టుకున్న వారంతా బయటకు వెళ్లిపోయారంటూ భరణి తనను తాను హైలైట్ చేసుకున్నారు. బయట అంత లేదన్న విషయాన్ని ఆయన గ్రహించలేకపోయారు. దివ్య నికిత (Divaya Nikitha) వచ్చి ఆయనను టాప్‌లో పెట్టడం.. ఆ తరువాత వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా భరణిని ఆకాశానికి ఎత్తడం వంటివి ఆయనలో తాను టాప్ కంటెస్టెంట్‌నన్న నమ్మకాన్ని పెంచాయి. అయితే భరణి ఈవారం ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి అయితే కాదు. దాదాపుగా ఈ వారం రామూ రాథోడ్ (Ramu Rathod) లేదంటే దివ్య నికిత బయటకు వెళ్లిపోతుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్‌బాస్ (Biggboss) భరణిని ఎలిమినేట్ చేయడం అన్‌ఫెయిర్‌గా అనిపిస్తోంది. దాదాపుగా బిగ్‌బాస్ నుంచి భరణి బయటకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 18, 2025 3:08 PM