others

Biggboss 9: బిగ్‌బాస్ 9 నుంచి ఈవారం ఊహించని ఎలిమినేషన్

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ నుంచి ఊహించని ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది.

Biggboss 9: బిగ్‌బాస్ 9 నుంచి ఈవారం ఊహించని ఎలిమినేషన్

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ నుంచి ఊహించని ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ (Biggboss Triangle Love Story) నుంచి ఒకరు సైడ్ అయిపోయాతారని ఎవరైనా ఊహించారా? దొంగతనాల క్వీన్ సంజన తన దొంగతనాల డోస్‌ను పెంచుతుందని ఎవరైనా ఊహించారా? ఎవరూ ఊహించని విధంగా రామూ రాథోడ్ (Ramu Rathod) బిగ్‌బాస్ హౌస్ కెప్టెన్ (Biggboss House Captain) అయ్యాడు. ఇన్ని జరిగాక ఎలిమినేషన్ మాత్రం ఊహించింది జరుగుతుందా? అది కూడా ఊహించనిదే జరిగింది. వాస్తవానికి కల్యాణ్ పడాలవర్సెస్ రీతూ చౌదరి, డెమాన్ పవన్ (Kalyan Padala Vs Rithu Chowdary and Demon Pawan) అవుతుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటిది జరిగిపోయింది. గత వారం నాగార్జున (Nagarjuna) వచ్చి దొంగతనాలు చేస్తే ఊరుకోబోమని మెడలో బోర్డు వేస్తామని చెప్పిన తర్వాత సంజన దొంగతనాలకు పూనుకుంటుందని ఎవరూ ఊహించలే.. కానీ ఆమె డోస్ పెంచేసి.. ఒక గుడ్డు దొంగతనం నుంచి దాదాపు 10 గుడ్లు దొంగిలించి తినే స్థాయికి వెళ్లింది.

ఇక ఈ వారం ఎలిమినేషన్‌ (Biggboss Elemination)లో సంజనా గర్లానీ (Sanjana Garlani), రీతూ చౌదరి (Rithu Chowdry), శ్రీజ(Srija), ఫ్లోరా షైని (Flora Saini), హరిత హరీష్ (Haritha Harish) ఉన్నారు. వారిలో సంజన అయితే ఓటింగ్ పరంగా టాప్‌లో ఉంది. ఆ తరువాత రీతూ, ఫ్లోరా ఉన్నారు. చివరిలో అంతా శ్రీజ బయటకు వెళ్లిపోతుందని భావించారు. కానీ కల్యాణ్‌కు శ్రీజ అండగా నిలవడంతో ఆమెకు ఓటింగ్ పెరిగింది. నిన్న టాస్క్‌లో రీతూ, పవన్ కలిసి కల్యాణ్‌కు దారుణంగా వెన్నుపోటు పొడవడం.. దీనికి శ్రీజ కల్యాణ్‌కు సపోర్ట్‌గా నిలిచింది. దీంతో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. మొత్తానికి హరిత హరీష్ ఎలిమినేట్ అవబోతున్నట్టు సమాచారం. గత రెండు రోజులుగా ఆయనకు గాయం అవడంతో టాస్క్‌లు ఆడకపోవడం కూడా ఆయనకు మైనస్ అయ్యింది. హరీష్ ఎలిమినేషన్‌కు ఒకే ఒక్క కారణం ఆయన స్ట్రెయిట్‌గా మాట్లాడటమే. ఇలా స్ట్రెయిట్‌గా మాట్లాడే వారికి ఫాలోయింగ్ అయితే రాదు. అదే ఇప్పుడు జరిగింది. దాదాపుగా హరిత హరీషే ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 4, 2025 1:42 PM