Biggboss 9: బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఎలిమినేషన్ ఆమేనట.. ఫిక్స్..!
ఈ వారం ఏమాత్రం ఊహించని కంటెస్టెంట్ బయటకు వెళ్లిపోతుందని టాక్ నడుస్తోంది. దీనికి కారణం కూడా ప్రచారంలో ఉంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు.
తెలుగు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతారో ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి. ఏమాత్రం ఊహించని వ్యక్తులు హౌస్ నుంచి వెళ్లిపోతున్నారు. తిరిగి వచ్చేస్తున్నారు. అసలు ఈ సీజన్ బిగ్‌బాస్ ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇదిలా ఉండగా ఈ వారం ఏమాత్రం ఊహించని కంటెస్టెంట్ బయటకు వెళ్లిపోతుందని టాక్ నడుస్తోంది. దీనికి కారణం కూడా ప్రచారంలో ఉంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు. దివ్వెల మాదురి. ఆమె ఎలిమినేట్ అవడమేంటి? ఓటింగ్ బాగానే ఉంది కదా అని అనిపించవచ్చు. కానీ ఓటింగ్ బాగుంటే సరిపోదని.. ఆమె హౌస్‌లోకి రావడానికి ముందు కూడా జరిగిందాన్ని బ బేస్ చేసుకుని ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. అసలు హౌస్‌లోకి రావడానికి ముందు ఏం జరిగింది? ఎందుకు దివ్వెల మాదురి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది? తెలుసుకుందాం.
మాదురి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఓటింగ్ ప్రకారం అయితే కాదని అంటున్నారు. ఆమెను బిగ్‌బాస్ టీం సంప్రదించినప్పుడే కేవలం మూడు వారాలు మాత్రమే హౌస్‌లో ఉంటానని డీల్ మాట్లాడుకుని వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఆ డీల్ ప్రకారమే దివ్వెల మాదురి ఎలిమినేట్ అవుతుందని.. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా ఈ వారం తాను ఎలిమినేట్ అయి వెళ్లిపోతానని పలు మార్లు ఆమె చెప్పిందని అంటున్నారు. అంతేకాకుండా తనే కావాలని నేరుగా తనూజతో నామినేషన్ చేయించుకుందని కూడా అంటున్నారు. ఇది నిజమై ఉండదని కేవలం అభూతకల్పనలేనని కొందరు అంటున్నారు. ఇలా డీల్ మాట్లాడుకుని మాదురి వచ్చి ఉంటే తనూజతో అంత ర్యాపో మెయిన్‌టైన్ చేసేది కాదనే టాక్ కూడా నడుస్తోంది. బయట తనూజకు ఉన్న ఓటు బ్యాంకు చూసే ఆమెతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతోందని టాక్. ఆమె ఇంత పక్కా ప్రణాళికతో ఉంటే ఇప్పుడప్పుడే బయటకు ఎందుకు వెళ్లిపోతుందని అంటున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..
ప్రజావాణి చీదిరాల