Biggboss9: ఈ వారం డబుల్ ఎలిమినేషన్..! ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరెవరంటే..
కనీసం టాస్కులు కూడా ఆడిస్తున్న పాపాన బిగ్‌బాస్ పోవడం లేదు. ఏదో కంటెస్టెంట్స్‌ని కూర్చోబెట్టి మేపుతున్నట్టుగా ఉంది. వాళ్లకు బోర్ కొట్టి ఏవో స్కిట్స్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu).. ఈ వారం అయితే పరమ బోరింగ్.. కనీసం టాస్కులు వంటివేమీ లేవు. నామినేషన్స్‌లో జోష్ లేదు. ఏదో కొత్త ప్రయోగం అయితే చేశారు కానీ సత్ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. దీంతో సోమవారం నుంచి ఏమాత్రం ఇంట్రస్టింగ్ లేదు. కనీసం టాస్కులు కూడా ఆడిస్తున్న పాపాన బిగ్‌బాస్ (Biggboss) పోవడం లేదు. ఏదో కంటెస్టెంట్స్ (Biggboss Contestants)ని కూర్చోబెట్టి మేపుతున్నట్టుగా ఉంది. వాళ్లకు బోర్ కొట్టి ఏవో స్కిట్స్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప బిగ్‌బాస్ చేసిందేమీ లేదు. ఇక ఈవారం నామినేషన్స్ (Biggboss Naminations)లో ఉన్నది ఎవరనేది అందరికీ తెలిసిందే. వారిలో ఎవరు సేవ్ అవుతారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సింగిల్ ఎలిమినేషన్ (Elimination) అయితే ఎవరైనా కళ్లుమూసుకుని ఈ వారం ఎవరు బయటకు వస్తారో చెప్పేస్తారు.
అదెవరో కాదు.. రీతూ చౌదరి (Rithu Chowdary). ఈమెకు బయట వస్తున్న నెగిటివిటీతో పాటు ఈ కారణంగా బాధపడిన కొందరు ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు వీడియోలు, ఫోటోలు బయటపెడుతున్నారు. ఇక హౌస్‌లోనూ ఈమెకు మంచి పేరేమీ లేదు. ఇద్దరు పులిహోర కలుపుతూ.. పులిహోర రాణిలా మారిపోయింది. ఒక్కరైతే ఈమె బయటకు రావడం ఫిక్స్. ఇక డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఈమెతో పాటు ప్రియ కూడా బయటకు వస్తుందనడంలో సందేహం లేదు. దీనికి కారణం ప్రియ (Priya Shetty)కు కూడా బయట బీభత్సమైన నెగిటివిటీ ఉంది. ఆమెకు ప్లస్ అయ్యే టాస్క్ ఒక్కటి కూడా పడంది లేదు. పైగా గత వారం సుమన్ శెట్టి (Suman Shetty) విషయంలో ప్రవర్తించిన తీరు కూడా ఆమెకు మైనస్. అది చాలదన్నట్టుగా శ్రీజ (Srija)తో కలిసి అందరిపై నోరేసుకుని పడిపోతుండటంతో బీభత్సమైన నెగిటివిటీ ప్రియకు వచ్చేసింది.
ఇక టాప్‌లో ఉన్నదెవరంటారా? రాము రాథోడ్ (Ramu Rathod). వాస్తవానికి ఇప్పటి వరకూ రాము రాథోడ్ ఒక టాస్క్‌లో అదరగొట్టాడు. అంతకు మించి చేసిందేమీ లేదు. సైలెంట్‌గా ఉంటూ వస్తున్నాడు. తన సింగింగ్ టాలెంట్‌ను కానీ.. కొరియోగ్రఫీని కానీ బయటకు తీయడం లేదు. అయినా సరే.. నెగటివిటీ అనేది లేదు కాబట్టి టాప్‌లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో ఆశ్చర్యకరంగా ఫ్లోరా శైనీ (Flora Shaini) ఉంది. ఈమె కూడా చాలా సైలెంట్ కానీ సెకండ్ ప్లేస్‌లో ఎందుకుందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇక మూడవ స్థానంలో హరిత హరీష్ (Haritha Harish) ఉన్నారు. ఆయన అయితే పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఇక డేంజర్ జోన్‌లో ప్రియ, రీతూతో పాటు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉన్నాడు.ఇతను వాస్తవానికి బిగ్‌బాస్ హౌస్‌లో చేసిందేమీ లేదు. పైగా రీతూని ఓదార్చడంతోనే ఇతనికి సరిపోతుంది. ఇది చూసిన వారికి జుగుప్స కలిగిస్తోంది. దీంతో బయట నెగిటివిటీ కూడా పెరిగిపోతోంది.
ప్రజావాణి చీదిరాల