Rain Alert: షాకింగ్ విషయం చెప్పిన వాతావరణ శాఖ
జూన్‌లో వర్షాలు ప్రారంభమై ఆగస్ట్‌తో ముగియడం అనేది సర్వసాధారణం. కానీ ఈ సారి సీన్ మారిపోయింది. ముందుగానే ప్రారంభమైన వర్షాలు ముందుగానే ముగుస్తాయని అనుకుంటున్నారేమో..

జూన్ (June) నెల వచ్చీరాగానే వర్షాకాలం (Raini Season) ప్రారంభమవుతుంది. అలాంటిది ఈసారి అసలు ఎండాకాలం (Summer)లోనే వర్షాలు (Rains) ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రోహిణి కార్తె ఎండలు ఈసారి పెద్దగా తెలియలేదనే చెప్పాలి. జూన్‌లో వర్షాలు ప్రారంభమై ఆగస్ట్‌తో ముగియడం అనేది సర్వసాధారణం. కానీ ఈ సారి సీన్ మారిపోయింది. ముందుగానే ప్రారంభమైన వర్షాలు ముందుగానే ముగుస్తాయని అనుకుంటున్నారేమో.. సెప్టెంబర్ అంతా దంచి కొడతాయట. ఈ సారి వర్షాలు గత సంవత్సరాల సరాసరిని సైతం దాటేశాయి. తాజాగా వాతావరణ శాఖ (Meteorological Department) ఓ షాకింగ్ విషయాన్ని తెలిపింది. అదేంటంటే.. సాధారణంగా సెప్టెంబర్ నెలలో కురిసే వర్షాల (Rains in September) కంటే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 109 శాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ చల్లగా చెప్పింది.
ఈ నెలలో అధిక వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. పైగా కొండ చరియలు విరిగిపడి జన జీవనం స్తంభించనుందని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ (Uttarakhand) బాగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. నదులు ఉప్పొంగటం.. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో కురిసే వర్షాలతో దక్షిణ హర్యానా.. ఢిల్లీ.. ఉత్తర రాజస్థాన్‌లో సాధారణ జనజీవనం స్తంభించే అవకాశం ఉందట. 1980 నుంచి గత రికార్డుల్ని పరిశీలిస్తే.. ప్రతి ఏటా సెప్టెంబర్‌లో వర్షాలు కురిసే అవకాశం పెరుగుతూ వస్తోందన్నారు. మధ్యలో కొన్ని ఏళ్లు మాత్రం తక్కువ వర్షాలు కురిశాయట. మరో విషయం ఏంటంటే.. ఈ నెలలో దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు గరిష్ట ఉష్ణోగ్రత (Temperature)ను నమోదయ్యే అవకాశం ఉందట. జూన్ నుంచి ఆగస్ట్ వరకూ కురిసిన వర్షాల దీర్ఘకాలిక సగటు కంటే.. సెప్టెంబర్‌లో 6 శాతం వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ (IMD) తెలిపింది.