Heart Attack: పెరుగుతున్న చలి.. గుండెకు ముప్పు.. పదిలంగా ఉంచుకోవాలంటే..
ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులకు.. వయసుకు ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. చిన్న వయసు నుంచే గుండె ప్రమాదాలు వస్తున్నాయి. దీనికి కారణాలు అనేకం. ముఖ్యంగా చలికాలంలో గుండె జబ్బులు మరింత పెరుగుతున్నాయి.
ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులకు.. వయసుకు ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. చిన్న వయసు నుంచే గుండె ప్రమాదాలు వస్తున్నాయి. దీనికి కారణాలు అనేకం. ముఖ్యంగా చలికాలంలో గుండె జబ్బులు మరింత పెరుగుతున్నాయి. చలి పెరుగుతున్నా కొద్దీ బీపీ, హార్ట్ ఎటాక్ వంటి సమస్యల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. చలికాలంలోనూ పదిలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
చలి పెరుగుతున్నా కొద్దీ మన ఆరోగ్యం ఇబ్బందులకు గురవుతూనే ఉంటుంది. చలికాలంలో జలుబు, జ్వరం వంటివి సర్వసాధారణం. ఇవి మాత్రమే కాకుండా బీపీ పెరుగుతూ ఉంటుంది. ఇది గుండెపోటుకి కారణమవుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా గుండె జబ్బులు వంటివి ఉన్నవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. దీని విషయంలో ప్రముఖ వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. చల్లని వాతావరణం అనేది మన శరీరంలోని రక్తనాళాలను సంకోచానికి గురి చేస్తుందట. తద్వారా రక్తపోటు పెరిగి గుండె పనితీరు కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు షుగర్ సమస్య ఉంటే అది కూడా రక్త నాళాలను దెబ్బతీస్తుందట. అలాంటప్పుడు ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండె సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో షుగర్, బీపీ లెవల్స్ ఎప్పటికప్పుడు కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి.
ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బరువును అదుపులో ఉంచుకునేందుకు యత్నించాలి. చలి కారణంగా ఎక్సర్‌సైజ్‌లకు దూరంగా ఉంటారు. దీనికి తోడు జంక్ ఫుడ్ తీసుకుంటే వెయిట్ పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఓవర్ వెయిట్ అనేది ఎన్నో సమస్యలకు కారణమవుతుంది కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇక స్మోకింగ్ చేసేవారికి, ఆల్కహాల్ తీసుకునే వారికి సైతం ప్రమాదం పొంచి ఉంది. బాడీలో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంది. దీని కారణంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. జంక్ ఫుడ్‌తో పాటు మనం వాడే ఆయిల్స్ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. అవి కూడా గుండె సమస్యలకు కారణమవుతాయి.