Biggboss9: ఊహించిన కంటెస్టెంటే అవుట్.. రీతూ పరిస్థితేంటంటే..
మరి ఈవారం ఎలిమినేట్ అయ్యిందెవరు? అంటే దాదాపుగా ముందుగానే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది అందరికీ తెలుసు. వాళ్లే బయటకు వచ్చేసినట్టు సమాచారం.

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు (Biggboss Season 9 Telugu) వీకెండ్ వచ్చేసింది. ఈ వారం అంతా చప్పగానే సాగింది. సంజనా గర్లానీ (Sanjana Garlani)ని సీక్రెట్ రూం (Secret Room)కి పంపించారు. ఇవాళ ఆమెను తిరిగి బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లోకి పంపించే అవకాశం ఉంది. ఇక నాగార్జున (Nagarjuna) ఆమెను స్టేజ్‌పైకి పిలవగానే ఒక్కొక్కరికీ తనేదో గొప్ప వ్యక్తి మాదిరిగా ఇచ్చి పడేసింది. హోస్ట్ నాగార్జున (Host Nagarjuna) అయితే ఆమెకు ఆమె చేస్తున్న దొంగతనాల గురించి సున్నితంగా వార్నింగ్ అయితే ఇచ్చేశారు. మార్చుకుంటే ఓకే.. లేదంటే ఆమె నామినేషన్స్ (Biggboss Nominations)లోకి వచ్చిందంటే జనాలే బయటకు లాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వీకెండ్ వచ్చేందంటే ఎలిమినేషన్ టైం కూడా వచ్చేసినట్టేగా..
ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..
మరి ఈవారం ఎలిమినేట్ (Biggboss Elemination) అయ్యిందెవరు? అంటే దాదాపుగా ముందుగానే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది అందరికీ తెలుసు. వాళ్లే బయటకు వచ్చేసినట్టు సమాచారం. వారం ప్రారంభంలో అయితే రీతూ చౌదరి (Rithu Chowdary) పక్కాగా బయటకు వస్తుందని అంతా భావించారు. ఎందుకంటే పోయిన వారం ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె కానీ గత వారం నామినేషన్స్ (Biggboss Nominations)లో ఉండి ఉంటే డౌట్ లేకుండా బయటకు వచ్చి ఉండేది. ఈవారం టాస్క్‌లో ఆమె ఇచ్చిన పోటీతో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఇక ఈవారం డేంజర్ జోన్ (Danger Zone)లో హరీష్ (Harish), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ప్రియ (Priya) ఉన్నారు.
హౌస్‌లో ఓదార్పు యాత్రలు..
హౌస్‌లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేపడుతున్న ఓదార్పు యాత్రలకు పక్కాగా ఆయనే బయటకు రావాలి కానీ కొద్దిలో మిస్ అయ్యాడు. హరీష్ పరిస్థితి కూడా అంతే. తానేదో విన్నర్ మెటీరియల్ (Winner Material) అని.. తాను మాత్రమే జెన్యూన్ అనేది అతని భావన. దీంతో ఆయనకు ఓటింగ్ తక్కువగానే పడింది. కానీ వీరందరికంటే దారుణంగా ప్రియకు పడింది. ఈ వారం ప్రియ కంటెంట్ ఏమీ ఇవ్వలేదు. ఆమెకు టాస్క్‌లు కూడా పడలేదు. దీంతో ప్రియ అసలు ఈవారం కనిపించలేదనే చెప్పాలి. దీంతో ఓటింగ్ దారుణంగా పడిపోయింది. మొత్తానికి హౌస్ (Biggboss House) నుంచి ప్రియ బయటకు వచ్చేసింది. ప్రియ వెళ్లిపోయింది కాబట్టి ఇక మీదట శ్రీజ (Srija) చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక తన ఆట తీరును సైతం మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వైల్డ్ కార్డ్స్ వచ్చి వెళ్లినప్పటి నుంచి తన ఆట తీరును శ్రీజ, ప్రియ ఇద్దరూ మార్చుకున్నారు కానీ ప్రియకు టైం లేకుండా పోయింది. ఈవారం నామినేషన్స్‌లో లేకుంటే ఇక ప్రియ కూడా ఆటను మార్చుకుని హౌస్‌లో ఉండేదేమో..
ప్రజావాణి చీదిరాల