Biggboss9: సోషల్ మీడియా మొత్తం ఆ ఇద్దరే.. క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్..
బిగ్‌బాస్ 9 తెలుగు ఈసారి కొందరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఈసారి ఆసక్తికరంగా ఓ ఇద్దరి మాట వినగానే జనాలు చిరాకు పడుతుంటే.. ఇద్దరిని మాత్రం ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు.

బిగ్‌బాస్ 9 తెలుగు ఈసారి కొందరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఈసారి ఆసక్తికరంగా ఓ ఇద్దరి మాట వినగానే జనాలు చిరాకు పడుతుంటే.. ఇద్దరిని మాత్రం ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఆ ఇద్దరూ జనాల మనసుల్ని దోచుకున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు అంతలా సోషల్ మీడియా వారిని అక్కున చేర్చుకుంది? తెలుసుకుందాం.
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu)లో డెమాన్ పవన్, రీతూ చౌదరిలను చూసి జనాలు చిరాకు పడుతుంటే.. తనూజ, భరణిలను చూసి వావ్ అంటున్నారు. తనూజ (Thanuja), భరణి (Bharani). తండ్రీకూతుళ్లుగా వీరిద్దరూ ఒకరిపై మరొకరు కురిపించుకుంటున్న ప్రేమ ఆప్యాయతలకు సోషల్ మీడియా (Social Media) ఫిదా అయిపోయింది. నాన్న అంటూ తనూజ చాలా క్యూట్‌గా పిలుస్తోంది. భరణి కూడా కూతురులా ఆమెను అక్కున చేర్చుకున్నారు. వీరిద్దరి క్యూట్ వీడియోలకు సాంగ్స్ యాడ్ చేసి మరీ సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. గతంలో శివాజీ (Shivaji)ని నయని పావని (Nayani Pavani) కూడా డాడీ అని పిలిచేది కానీ అంత క్యూట్‌గా ఏమీ అనిపించేది కాదు. వీరిద్దరూ మాత్రం చాలా క్యూట్‌గా అనిపిస్తున్నారు.
పదహారణాల తెలుగింటి అమ్మాయిలా..
తనూజ కాఫీ పౌడర్ కోసం ఇబ్బంది పడుతుంటే.. అది తనకు ఇప్పించాలని ఇమ్మాన్యుయేల్ (Immanuel)కు గట్టిగా భరణి చెప్పడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తనకేం సమస్య వచ్చినా కూడా నాన్న అంటూ తనూజ వెళ్లి భరణికి కంప్లైంట్ చేయడం.. ఆయన కూడా వెంటనే వచ్చి దానిని సాల్వ్ చేయడం వంటివి జనాలకు చాలా నచ్చుతున్నాయి. బిగ్‌బాస్ (Biggboss) రివ్యూయర్లు సైతం తనూజ, భరణి గురించే మాట్లాడుతుండటంతో వీరిద్దరూ బాగా హైలైట్ అవుతున్నారు. ఇకపోతే తనూజ కూడా ఎక్కడా అతికి వెళ్లడం లేదు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా నీట్‌గా ఉంది. చుడీదార్ లేదంటే శారీలో చక్కగా పదహారణాల తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తోంది. దీనికి ప్రేక్షకులు మరింత ఫిదా అవుతున్నారు.
ముగ్గురు కామనర్స్..
ఇక రేపు బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లోకి వైల్డ్ కార్డ్ (Wild Card) ద్వారా కామనర్స్ నుంచి ముగ్గురు ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. వారిలో షాకీబ్, నాగ, దివ్య నికిత ఉన్నారు. వీరికి బిగ్‌బాస్ ఒక టాస్క్ పెట్టి ఎవరు నెగ్గితే వారిని బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉంచనున్నారు. మిగిలిన ఇద్దరూ తిరిగి బయటకు వచ్చేయనున్నారు. ఏదైతేనేమి కామనర్స్ ముగ్గురు అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ (Double Elemination) ఉంటుందని అంటున్నారు. ఇక ప్రియ (Priya Shetty), రీతూ చౌదరి (Rithu Chowdary) ఎలిమినేట్ అవుతారంటూ టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో కామనర్స్‌లో అమ్మాయిల సంఖ్య తగ్గుతోంది కాబట్టి దివ్య నికితను ఉంచుతారని అంటున్నారు. టాస్క్ పెట్టినా కూడా ఆమెకు ఫేవర్‌గానే ఉంటుందని టాక్.
ప్రజావాణి చీదిరాల