Big Breaking: శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ప్రధాన తంత్రి అరెస్ట్
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆలయ తంత్రి అంటే ప్రధాన పూజారి కందరారు రాజీవరు అరెస్ట్ అయ్యారు. శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం చూపించిన కేసు దేశంలో సంచలనం రేపింది.
శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆలయ తంత్రి అంటే ప్రధాన పూజారి కందరారు రాజీవరు అరెస్ట్ అయ్యారు. శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం చూపించిన కేసు దేశంలో సంచలనం రేపింది. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ తాజాగా రాజీవరును అరెస్ట్ చేసింది. దీంతో అరెస్టుల సంఖ్య 11కి చేరింది. ఈ కేసులో ఇప్పటికే పద్మకుమార్, ఉన్నికృష్ణన్ పొట్టి అరెస్ట్ అయ్యారు. ఆ ఇద్దరి వాంగ్మూలం మేరకు సిట్ అధికారులు తంత్రి రాజీవరును ఇవాళ ఉదయం నుంచి విచారణ ప్రారంభించారు. విచారణ పూర్తైన మీదట ఆయననను అరెస్ట్ చేశారు.
కొల్లంలోని కోర్టులో రాజీవరును వెంటనే హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన తంత్రిని గత నవంబర్‌లోనూ సిట్ విచారణ జరిపింది. ఈ కేసులో ఉన్ని కృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనను శబరిమల కాంట్రాక్టులకు తీసుకొచ్చింది కందరారు రాజీవర్ అని ఈ కేసులో అరెస్ట్ అయిన పద్మకుమార్ తదితరులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ వాంగ్మూలాల ఆధారంగా ఈ రోజు ఉదయం రాజీవర్‌ను సిట్ కార్యాలయానికి పిలిపించి రెండున్నర గంటల పాటు విచారణ నిర్వహించారు. అనంతరం అరెస్టు చేశారు.
శబరిమల కేసులో ఇప్పటివరకూ అరెస్టైనది ఎవరెవరంటే..
1. స్పాన్సర్ - ఉన్నికృష్ణన్ పొట్టి
2. మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దేవస్వం బోర్డు - మురారిబాబు
3. మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - డి.సుధీష్ కుమార్
4. తిరువాభరణం మాజీ కమిషనర్ - కెఎస్ బైజు
5. మాజీ దేవస్వం కమిషనర్, అధ్యక్షుడు - ఎన్.వాసు
6. మాజీ దేవస్వం బోర్డు అధ్యక్షుడు - ఎ.పద్మకుమార్
7. మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - ఎస్.శ్రీకుమార్
8. సీఈవో, స్మార్ట్ క్రియేషన్స్ - పంకజ్ భండారి
9. ఆభరణాల వ్యాపారి - బళ్లారి గోవర్ధన్
10. మాజీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు - ఎన్.విజయకుమార్
11. శబరిమల తంత్రి - కందర్ రాజీవరార్