Ramchander Rao: వ్యక్తులు, ప్రాంతాల మధ్య విభేదాలను బీజేపీ సమర్ధించదు..
ఇటీవలి కాలంలో షిర్డీ సాయిబాబాపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటు.. శ్రీ సాయిబాబా భక్తులను సైతం కించపరుస్తుండటంపై షిర్డీ సాయి భక్తల సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో షిర్డీ సాయిబాబాపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటు.. శ్రీ సాయిబాబా భక్తులను సైతం కించపరుస్తుండటంపై షిర్డీ సాయి భక్తల సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని పరిశీలించిన అనంతరం రామచందర్‌రావు షిర్డీ సాయిబాబాపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యాలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. సమాజంలో ఐక్యత, మతసామరస్యం, దేశభక్తిని పెంపొందించే విధంగా బీజేపీ పనిచేస్తుందని అన్నారు.
వ్యక్తుల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలను తమ పార్టీ ఎప్పటికీ సమర్థించదని రాంచందర్ రావు అన్నారు. కోట్లాది మంది షిర్డీ సాయిబాబా భక్తుల మానో భావాలను కించపరిచే విధంగా కొంత మంది చేస్తున్న వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ షిర్డీ సాయిబాబా భక్తులందరికీ క్షమాపణ చెప్పాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. సోషల్ మీడియా మాద్యమాలలో ఉన్న సంబంధిత వీడియోలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. రాంచందర్‌రావును కలిసిన వారిలో రాజవర్ధన్,మంచికంటి ధనుంజయ, గుండా మల్లయ్య, మైనంపాటి ప్రసాద్, పి వీ సాయి, భాను ప్రతాప్, సాయి శ్రీనివాస్ తదితరులున్నారు.