Biggboss 9: సడెన్‌గా పడిపోయిన తనూజ? టెన్షన్‌లో బిగ్‌బాస్ హౌస్.. అసలేమైంది?
తనూజ (Tanuja) సడెన్‌గా పడిపోయింది. అంతా సోఫాలో కూర్చోబెట్టి ఎంత పిలుస్తున్నా కూడా పలకదు. అంతా కేకలు పెడుతూ కంగారు పడుతుంటడం ప్రోమో (Biggboss Promo)లో కనిపించింది. తనూజ సైతం ప్రతిసారి హ్యాట్‌ను తీసుకునేందుకు గట్టిగానే ప్రయత్నించింది
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఈ వారమంతా చప్పగా సాగుతోంది. ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా లేని టాస్క్‌లతో తెలుగు బిగ్‌బాస్ చరిత్ర (Biggboss History)లోనే ది వరస్ట్ టాస్క్‌లు నిర్వహించడం జరుగుతోంది. మొత్తానికి బిగ్‌బాస్ మొత్తం గందరగోళంగా నడుస్తోంది. రెండు గ్రూపులుగా విడగొట్టి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌ను రెండు రోజుల పాటు నడిపించిన బిగ్‌బాస్ (Biggboss).. ఇవాళ మాత్రం కెప్టెన్సీ టాస్క్ (Captaincy Task) పెట్టాడు. దాని పేరు హ్యాట్‌తో వేట. దీనికి గానూ ఒక సర్కిల్ గీసి దాని మధ్యలో హ్యాట్‌ను పెట్టి.. రెండు గ్రూపుల నుంచి ముగ్గురు చొప్పున హ్యాట్ కోసం పోటీ పడ్డారు. ఎవరి చేతికైతే హ్యాట్ దొరుకుతుందో వారు తమ టీం మెంబర్‌కు ఇచ్చి అవతలి గ్రూపులో ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాలి.
దీనికి సంబంధించిన ప్రోమో (Biggboss Promo) తాజాగా బయటకు వచ్చింది. ఆ ప్రోమో ప్రకారం ఫస్ట్ హ్యాట్‌ను నిఖిల్ పట్టుకుని గౌరవ్‌కు ఇచ్చాడు. ఆ తరువాత దాదాపుగా అన్ని సార్లు ఇమ్మాన్యుయేల్ హ్యాట్‌ను దక్కించుకున్నాడు. గౌరవ్ (Gowrav).. కల్యాణ్ (Kalyan)ను తీసేయగా.. ఆ తరువాత నిఖిల్ (Nikhil), రీతూ (Rithu Chowdary)ని టాస్క్ నుంచి తొలగించారు. ఆ తరువాత ఏమైందో కానీ తనూజ (Tanuja) సడెన్‌గా పడిపోయింది. అంతా సోఫాలో కూర్చోబెట్టి ఎంత పిలుస్తున్నా కూడా పలకదు. అంతా కేకలు పెడుతూ కంగారు పడుతుంటడం ప్రోమో (Biggboss Promo)లో కనిపించింది. తనూజ సైతం ప్రతిసారి హ్యాట్‌ను తీసుకునేందుకు గట్టిగానే ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె బాగా టెన్షన్‌కు గురైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే విపరీతమైన ఒత్తిడికి గురై కానీ లేదంటే లో బీపీ కారణంగా కానీ పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక షో చూస్తే కానీ అసలేం జరిగిందనేది తెలియదు.
ప్రజావాణి చీదిరాల