Silver Price: రూ.4 లక్షలకు ఎగిసి ఆకాశపు హద్దులు కూడా దాటేసిన వెండి
గతంలో అయితే వెండి కొండెక్కిందనో.. లేదంటే ఆకాశాన్నంటుతోందనో అనేవారం. కానీ ఇప్పుడు ఆకాశం కాదండోయ్.. దాని హద్దులు కూడా దాటేసింది. కిలో వెండి ధర రూ.4 లక్షలు. ఇంతకు ముందు బంగారంపై పెట్టుబడి పెట్టమనేవారు.
గతంలో అయితే వెండి కొండెక్కిందనో.. లేదంటే ఆకాశాన్నంటుతోందనో అనేవారం. కానీ ఇప్పుడు ఆకాశం కాదండోయ్.. దాని హద్దులు కూడా దాటేసింది. కిలో వెండి ధర రూ.4 లక్షలు. ఇంతకు ముందు బంగారంపై పెట్టుబడి పెట్టమనేవారు. ఇప్పుడు బంగారం కాదు.. వెండిపై పెట్టుబడి పెట్టమంటున్నారు. పెడుతున్నారు కూడా. అందుకే వెండి దూసుకెళుతోంది. బంగారం ధర వచ్చేసి రూ.2 లక్షల వైపు పరుగులు తీస్తుండగా.. వెండి మాత్రం ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఏకంగా రూ.4 లక్షలు దాటేసింది. ఇది ఆల్‌టైం గరిష్టానికి చేరడం విశేషం.
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,85,000 దాటగా.. వెండి ధర (Silver Rate) రూ.4,00,000 పలికింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,73,300గా ఉంది. అంటే కొన్ని గంటల్లోనే రూ.12 వేలు పెరిగింది. ఇక కిలో వెండి ధర వచ్చేసి బుధవారం రాత్రి రూ.3,79,700 వద్ద ముగియగా.. ఇవాళ అంటే కొన్ని గంటల్లోనే రూ.21 వేలకు పైగా పెరగడం విశేషం. కొన్ని గంటల్లోనే వెండి లైఫ్ టైమ్ హైని టచ్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి