Biggboss 9: షాకింగ్ బిగ్‌బాస్ నుంచి ఆమె అవుట్.. ఇప్పుడు పక్కకెళ్లి ఆడుకుంటుందేమో..
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 telugu) వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ (Bigbboss Elimination) టైం వచ్చేసింది. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొనే ఉంటుంది.
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 telugu) వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్ (Bigbboss Elimination) టైం వచ్చేసింది. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొనే ఉంటుంది. ఆసక్తికరంగా ఈసారి ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. బయట ఉన్న నెగిటివిటీ చాలదన్నట్టుగా హౌస్ (Biggboss House)లోకి వచ్చి మరీ నెగిటివిటీ మూటగట్టుకుందా కంటెస్టెంట్. అంతటితో ఆగిందా? కాస్త బయట ఉన్న నెగిటివిటీని తగ్గించుకునే ప్రయత్నమే చేసింది లేదు. పైగా తనూజను టార్గెట్ చేసి నానా మాటలు అనేసింది. నామినేషన్ టాస్క్ (Namination Task)లో ఇష్టానుసారంగా నోటికి పని చెప్పింది.
అది మాత్రమేనా.. తనూజ (Tanuja) గురించి ఆమె బ్యాగు వెదికి టిష్యూ తీసి.. దానిపై ‘పక్కకెళ్లి ఆడుకోపోవే’ అని రాసింది. ఇన్ని చెప్పిన తర్వాత ఆ కంటెస్టెంట్ ఎవరనేది అర్ధం కాకుండా ఉంటుందా? అవును మీరు ఊహిస్తున్నది కరెక్టే.. అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) రమ్య ఈవారం ఎలిమినేట్ అయ్యిందని సమాచారం. ఇప్పుడు ఈమె బిగ్‌బాస్ హౌస్ నుంచి పక్కకు వెళ్లి ఆడుకుంటుందేమో.. అలేఖ్య చిట్టి పికిల్స్.. వారి పికిల్స్‌కి డిమాండ్ ఏమైనా వచ్చిందో లేదో కానీ వారికి మాత్రం కావల్సినంత నెగిటివిటీ వచ్చింది. అయినా సరే.. వారి యూట్యూబ్ (Youtube) ఛానల్స్ ద్వారా రమ్యకు కావల్సినంత ప్రచారం అయితే కల్పించారు కానీ ఏం లాభం బయట ఉన్న నెగిటివిటీకి తోడు ఇంట్లోకి వెళ్లి కూడా నెగిటివిటీ మూటగట్టుకుంది.
ఇక అంతే.. రెండో వారమే రమ్య (Ramya) అవుట్ అని తెలుస్తోంది. వాస్తవానికి గత వారం లీస్ట్‌లో రామూ రాథోడ్ (Ramu Rathod) ఉన్నాడు. ఈవారం కూడా అతను ఎలిమినేషన్‌లో ఉండటంతో అతనే బయటకు వచ్చేస్తాడని అంతా భావించారు కానీ రమ్యకు ఉన్న నెగిటివిటీతో ఆమె బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రమ్య ఎలిమినేషన్ వార్త నిజమే అయితే ఆనందించే వారి సంఖ్య చాలా ఎక్కువే అని చెప్పాలి. ఇప్పటికే సోషల్ మీడియా (Social Media)లో ఈ విషయమై రచ్చ జరుగుతోంది. రమ్యకు వ్యతిరేకంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ పని చేశాయి. కేవలం ఆమెపై ఉన్న నెగిటివిటీ కారణంగానే ఇదంతా జరిగింది.
ప్రజావాణి చీదిరాల