Biggboss: షాకింగ్.. బిగ్‌బాస్ హౌస్‌కు తాళాలు వేసిన రెవెన్యూ అధికారులు
షాకింగ్ న్యూస్ ఇది. బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)కు సడెన్‌గా తాళాలు పడ్డాయి. దీనికి కారణం కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) నోటీసులు జారీ చేయడంతో బిగ్‌బాస్ హౌస్‌కు తాళాలు వేయడం జరిగింది.

షాకింగ్ న్యూస్ ఇది. బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)కు సడెన్‌గా తాళాలు పడ్డాయి. దీనికి కారణం కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) నోటీసులు జారీ చేయడంతో బిగ్‌బాస్ హౌస్‌కు తాళాలు వేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు (Revenue Officials) మంగళవారం హౌస్‌కు తాళాలు వేశారు. అయితే ఇది తెలుగు రియాలిటీ షో (Telugu Reality Show) కాదులెండి... బిగ్‌బాస్ (Biggboss) కన్నడ రియాలిటీ షో. బిడదిలోని అమ్యూజ్‌మెంట్ పార్కులో ‘జాలీవుడ్’ స్టూడియో(Jollywood Studio)లో బిగ్‌బాస్ రియాలిటీ షో (Biggboss Relity Show) సెట్ వేశారు. ఇక్కడే రియాలిటీ షో నడుస్తోంది. దీని నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తోందని ఆరోపణలు వచ్చాయి.
అంతేకాకుండా ఈ బిగ్‌బాస్ హౌస్‌లో ఉపయోగించిన ప్లాస్టిక్ గ్లాసులు, వంటింటి వ్యర్థాలు పెద్ద ఎత్తున రహదారి పక్కనే పారబోస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ రెండు విషయాలపై కాలుష్య నియంత్రణ మండలికి నోటీసులు అందాయి. ఈ క్రమంలోనే కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు తీసుకునేందుకు షో నిర్వాహకులు నిరాకరించారు. దీంతో తహసీల్దారు తేజస్విని అధికారులతో కలిసి వెళ్లి బిగ్‌బాస్ హౌస్‌కు బయటి నుంచి తాళం వేశారు. దీనిపై పర్యావరణశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే (Environment Minister Eshwar Khandre) మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌కు విద్యుత్తు సరఫరాను కూడా నిలిపివేయాలని సంబంధిత అధికారులను ఆేశించినట్టు తెలిపారు. నోటీసులకు బిగ్‌బాస్ నిర్వాహకులు స్పందించకపోవడంతో చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు వారాల నుంచి ప్రదర్శితమవుతున్న బిగ్‌బాస్ హౌస్ సీజన్-12 మధ్యలోనే నిలిచిపోతుందా? లేదంటే హుటాహుటిన ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అనేది తెలియాల్సి ఉంది.
ప్రజావాణి చీదిరాల