others

Viral News: 39 ఏళ్ల కార్డియక్ సర్జన్ విధుల్లో ఉండగా షాకింగ్ ఘటన..

ఒకప్పుడు గుండెపోటు అంటే 60 ఏళ్లు దాటాక వచ్చేది. ఇప్పుడు అలా కాదు.. వయసుతో సంబంధం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. కరోనా సమయం తర్వాత గుండెపోటు మరణాలు మరింత ఎక్కువయ్యాయి.

Viral News: 39 ఏళ్ల కార్డియక్ సర్జన్ విధుల్లో ఉండగా షాకింగ్ ఘటన..

ఒకప్పుడు గుండెపోటు (Heart Attack) అంటే 60 ఏళ్లు దాటాక వచ్చేది. ఇప్పుడు అలా కాదు.. వయసుతో సంబంధం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. కరోనా (Covid) సమయం తర్వాత గుండెపోటు మరణాలు మరింత ఎక్కువయ్యాయి. చిన్న వయసు పిల్లలకు సైతం గుండెపోటు వస్తోంది. శారీరకంగా ఎంత ఫిట్‌ (Physical Fitness)గా ఉన్నా కూడా ఎందుకో హఠాన్మరణం మనుషులను పొట్టనబెట్టుకుంటోంది. కార్డియాక్ సర్జన్ ఒకరు గుండెపోటుతో మరణించడం విషయం తెలిసిన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అది కూడా 39 ఏళ్ల వయసులో. వాస్తవానికి కార్డియాక్ సర్జన్ (Cardiac Surgeon) అంటే గుండె (Heart)కు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలోనూ అవగాహన కలిగి.. అలర్ట్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అలాంటిది గుండెపోటుతో మరణించడం షాక్‌ కలిగిస్తోంది.

చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 39 ఏళ్ల డా.గ్రాడ్లిన్‌ రాయ్‌ (Dr Gradlin Roy).. కార్డియాక్‌ సర్జన్‌ (Cardiac Surgeon)గా పని చేస్తున్నారు. ఆయన తాజాగా గుండెపోటు (Heart Attack)తో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రాడ్లిన్ బుధవారం విధుల్లో భాగంగా ఆసుపత్రి వార్డుల్లో రౌండ్స్‌లో ఉన్నారు. సడెన్‌గా ఆయనకు గుండెపోటు రావడం (Heart attack to Cardiac Surgeon)తో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రి ఐసీయూకి తరలించి బతికించేందుకు శతవిధాలుగా ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. గ్రాడ్లిన్‌ రాయ్‌ ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ఒక కార్డియాక్ సర్జన్ ఇలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం అనేది ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. ఇప్పుడీ ఘటన నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

ఆసుపత్రి వైద్యులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. వాస్తవానికి గ్రాడ్లిన్‌ రాయ్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవట. ప్రస్తుతం యువత ఎందుకు ఇంతలా గుండెపోటు బారిన పడుతోంంటే.. ఒకే ఒక్క కారణన్ని వైద్యులు (Doctors) పేర్కొంటున్నారు. కేవలం యువత గుండెపోటుకు గురవడానికి ఒత్తిడి, దీర్ఘకాలిక పని గంటలే కారణమని నిపుణులు చెబుతున్నారు. పైగా వైద్యులు రోజులు దాదాపుగా 18 గంటల పాటు పని చేస్తుంటారు. కొన్ని సమయాల్లో 24 గంటల పాటు సైతం విధుల్లో ఉండాల్సిన పరిస్థితులు వస్తుంటాయట. ఈ కారణంగానే వైద్యులు ఒత్తిడికి గురవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మరికొందరిలో జీవనశైలితో పాటు ఏమాత్రం ఎక్సర్‌సైజ్ (Excercise) లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 30, 2025 6:59 AM