షాకింగ్.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు 15 హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే..
మనకు తప్పనిసరిగా నెలలో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా బ్యాంకును సందర్శిస్తూ ఉంటాం. డబ్బు డిపాజిట్ చేయడం కోసమో.. అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందనో.. పాస్‌బుక్ అప్‌డేట్ కారణమేదైతేనేం.. బ్యాంకును మాత్రం తప్పనిసరిగా సందర్శిస్తూ ఉంటాం.

మనకు తప్పనిసరిగా నెలలో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా బ్యాంకును సందర్శిస్తూ ఉంటాం. డబ్బు డిపాజిట్ (Money Deposite) చేయడం కోసమో.. అకౌంట్ (Account) ఫ్రీజ్ అయ్యిందనో.. పాస్‌బుక్ Passbook) అప్‌డేట్ కారణమేదైతేనేం.. బ్యాంకును మాత్రం తప్పనిసరిగా సందర్శిస్తూ ఉంటాం. ఇక నెలంతా బ్యాంకులు తెరిచే ఉండవు కదా.. వీకెండ్ హాలిడేస్ ఎలాగూ ఉండనే ఉంటాయి. వాటికి తోడు సెప్టెంబర్‌లో ఇంకా ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం. బ్యాంకు సెలవుల (Bank Holidays)నేవి ఆయా రాష్ట్ర సంప్రదాలను అనుసరించి వేర్వేరుగానూ.. రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank Of India) షెడ్యూల్ ప్రకారంగానూ ఉంటుంది. ఇకపోతే ఈ నెలలో లాంగ్ వీకెండ్స్ వచ్చేసి.. సెప్టెంబర్ తొలివారం ఉండనుంది.
సెప్టెంబర్ 5న ఈద్-ఏ-మిలాద్ పండుగ, 6న ఈద్-ఏ-మిలాద్, 7న ఆదివారం వీకెండ్ హాలిడే. ఈ మూడు రోజులు అన్ని రాష్ట్రాల వారికి కాదు కానీ.. కొన్ని రాష్ట్రాల ప్రజలకు ఉండనుంది. అలాగే సెప్టెంబర్ 13న రెండో శనివారం, 14.. అలాగే 27న నాలుగో శనివారం, 28న ఆదివారం సెలవు. ఈ వీకెండ్ హాలిడేస్ (Holidays) దేశవ్యాప్తంగా ఉంటాయి. కాబట్టి సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు వెళ్లేవారు సెలవులను దృష్టిలో పెట్టుకుని వెళితే మంచిది. బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నా కూడా డిజిటల్ లావాదేవీల (Digital Transactions)కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం బ్యాంకులో జరగాల్సిన ఫిజికల్ పనులు మాత్రం జరగవు. కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగేలా అన్ని బ్యాంకులకూ డిజిటల్ సర్వీసులు (Digital Services) అందుబాటులో ఉంటాయి.