others Breaking News

Shiva Balaji: ముద్ర డిజైనర్ స్టూడియోలో మెరిసిన శివబాలాజీ, మధుమిత..

హైదరాబాద్ నగరంలోని కొత్తపేట్ ‘ముద్ర డిజైనర్ స్టూడియో’లో శివ బాలాజీ, మధుమిత తళుక్కున మెరిశారు. మధుమితకు ముద్ర డిజైనర్ స్టూడియో నిర్వాహకురాలు లక్ష్మి కాలేజ్‌మెట్.

Shiva Balaji: ముద్ర డిజైనర్ స్టూడియోలో మెరిసిన శివబాలాజీ, మధుమిత..

హైదరాబాద్ నగరంలోని కొత్తపేట్ ‘ముద్ర డిజైనర్ స్టూడియో’లో శివ బాలాజీ, మధుమిత తళుక్కున మెరిశారు. మధుమితకు ముద్ర డిజైనర్ స్టూడియో నిర్వాహకురాలు లక్ష్మి కాలేజ్‌మెట్. దీంతో తన భర్త శివ బాలాజీతో కలిసి వెళ్లి స్టూడియోను సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మి, మధుమితలు తమ కాలేజ్ డేస్‌ను గుర్తు చేసుకున్నారు. ‘కన్నప్ప’ సమయంలోనూ లక్ష్మి చేసిన సహాయం గురించి కూడా ఈ సందర్భంగా వీరంతా చర్చించుకున్నారు. శివబాలాజీ, మధుమిత దంపతులు స్టూడియో‌ అంతా తిరిగి, రకరకాల కలెక్షన్స్‌ను చూసి ఆశ్చర్యపోయారు.

ఈ సందర్భంగా మధుమిత మాట్లాడుతూ .. తాను ఇంటర్ చదివే సమయంలో లక్ష్మితో పరిచయం ఏర్పడిందని వెల్లడించింది. ‘కన్నప్ప’ టైంలో తాము క్యాస్టూమ్స్ కోసం వెదుకుతుండగా.. లక్ష్మి నిర్వహిస్తున్న ముద్ర స్టూడియో గురించి తెలిసిందని.. వెంటనే తాము ఆమెను సంప్రదించగా.. తక్కువ టైంలో తమకు కావాల్సినవన్నీ సమకూర్చారన్నారు. ముద్ర డిజైనర్ స్టూడియో గురించి ఇన్ స్టాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటుందని మధుమిత పేర్కొంది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా తన లక్ష్మి అక్కని కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

శివ బాలాజీ మాట్లాడుతూ .. పెళ్లైన కొత్తలో ఇలా షాపింగ్‌కి వెళ్లానని... మళ్లీ ఇప్పుడు ‘ముద్ర డిజైనర్ స్టూడియో’కి వచ్చానని తెలిపాడు. ముద్ర డిజైనర్ స్టూడియో టీంకు శివబాలాజీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ముద్ర డిజైనర్ స్టూడియో నిర్వాహకురాలు లక్ష్మి మాట్లాడుతూ .. తనకు చిన్నతనం నుంచి మధుమితతో పరిచయం ఉందని తెలిపారు. బిగ్ బాస్ షోలో శివ బాలాజీని చూసి అభిమానిగా మారానని వెల్లడించారు. మళ్లీ వీరిని ఇలా కలవడం ఆనందంగా ఉందని లక్ష్మి పేర్కొన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 2, 2025 3:22 PM