others

Viral News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. న్యాయం కోసం పెద్ద ఎత్తున డిమాండ్..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ సంఘటన సంచలనంగా మారింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన పని రెండు తెలుగు రాష్ట్రాలు అవాక్కయ్యాయి. ఈ సంఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Viral News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. న్యాయం కోసం పెద్ద ఎత్తున డిమాండ్..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ సంఘటన సంచలనంగా మారింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన పని రెండు తెలుగు రాష్ట్రాలు అవాక్కయ్యాయి. ఈ సంఘటన కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. అదేటంటే.. మన దేశంలో కొందరికి ఫ్రీడం మరీ ఎక్కువైందా? చివరకు మేము జాతీయ జెండాను ఎగురవేయలేము అనేంతలా ఫ్రీడం పెరిగిపోయిందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. కారణం చెప్పకుండా.. బహిరంగంగానే ‘నేను జాతీయ జెండాను ఎగురవేయను.. ఏం చేసుకుంటే చేసుకోండి’ అనే స్థాయికి ఫ్రీడం పెరిగిపోయింది. అందరి విషయంలోనూ కాదులెండి.. ఒకరిద్దరు ఇదే బాటలో నడుస్తున్నారు. బహుశా ఇలాంటి ఘటనలు భారత్‌లో తప్ప మరెక్కడా చూడలేలేమేమో. ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా?

దేశ ఐక్యతకు చిహ్నంగా మువ్వెన్నల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి యావత్ దేశం సెల్యూట్ చేసింది. ఊరూరా.. వాడవాడలా జాతీయ జెండా (National Flag) ఎగిరింది. దేశ ప్రజలంతా స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independece day) అత్యంత వైభవంగా నిర్వహించారు. కనీసం ఇంటి నుంచి బయటకు రాలేని వారు సైతం సామాజిక మాధ్యమాల (Social Media) ద్వారా విశెష్ చెప్పుకుని సంబరాల్లో మునిగితేలారు. అలాంటి సమయంలో మొయినాబాద్ చిలుకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మాత్రం మధ్యాహ్నం 12 అయినా కూడా జెండా ఎగరలేదు. చూసి చూసి తీవ్ర అసహనానికి గురైన గ్రామస్థులు నిరసనకు దిగారు. అయినా సరే.. తాను జాతీయ జండాను ఎగురవేసేది లేదని కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ తెగేసి చెప్పారు. గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అదేమంటూ ఖాజా మొయినుద్దీన్‌తో వాగ్వాదానికి దిగారు. అయినా సరే.. ఆయన మాత్రం ససేమిరా అన్నారు. కారణం చెప్పలేదు కానీ జెండాను అయితే ఎగురవేసేది లేదని తెగేసి మరీ చెప్పారు. మరీ ఈ వ్యక్తిని సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకుంటే అయిపోతుందా? ఇంతకు మించిన పనిష్మెంటును ప్రజానీకం కోరుతోంది. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా కూడా నెట్టింట ఖాజా మొయినుద్దీన్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

ఇలాంటి ఘటనే 2022లో..

గతంలోనూ అంటే 2022లో ఓ ప్రధానోపాధ్యాయురాలు ఇలాగే చేసింది. కుల, మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా ఏకమై జరుపుకోవాల్సిన ఈ పండుగ నాడు తాను జాతీయ జెండాను ఎగురవేయలేని తెగేసి చెప్పింది. తానొక క్రిస్టియన్ (Cristian) అని.. జాతీయ జెండాను ఎగురవేసి దానికి నమస్కరించలేనని తేల్చి చెప్పింది. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఆమె పేరు తమిళ సెల్వి. తాము తమ దేవుడికి తప్ప ఎవ్వరికీ నమస్కారం చేయలేమనేది ఆమె వాదన. పైగా ఆమె అదే ఏడాది రిటైర్ అవనుండటంతో ఆమెను జాతీయ జెండా ఎగుర వేసిన అనంతరం సన్మానించాలని అంతా భావించి దానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆమె మాత్రం మతం పేరు చెప్పి అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయురాలిని జాతీయ జెండాను ఎగురవేయమని కోరింది. పైగా ఆగస్ట్ 15న సిక్ లీవ్ పెట్టి ఇంట్లో కూర్చొంది. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆమె రికార్డులను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ఆ ఒక్క ఏడాదే కాదు.. అంతకు ముందు కొన్నేళ్లుగా జాతీయ పండుగకు ఏదో ఒక కారణంతో సెలవు పెడుతున్నట్టు తేలడంతో అవాక్కవడం అధికారుల వంతైంది.

ఇంత ఫ్రీడమ్ సమంజసమేనా?

ఇలాంటి వారిని ఏం చేయాలంటారు? జాతీయ జెండాను ఎగురవేయలేనంత ఫ్రీడమ్‌ (Freedom) సమంజసమేనా? ఇలా మేము జాతీయ జెండాను ఎగురవేయలేమని చెప్పిన వారి ఫ్రీడమ్‌కు కళ్లెం వేస్తారా? లేదంటే.. అలాంటి వారందరినీ ఏదో సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? ఇదే బాటను మరొకరు అనుసరించరని ఏంటి? కాబట్టి పనిష్మెంట్ గట్టిగానే ఉండాలని ప్రజలు కోరుతున్నారు. మరి ప్రజల న్యాయమైన ఈ డిమాండ్‌కు ప్రభుత్వాధికారులు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 18, 2025 5:43 AM