others

Biggboss9: లైవ్‌లో సంజన వీరంగం.. బిగ్‌బాస్ ఫేవరిటిజం

తనుజా(Biggboss Tanuja Puttaswamy)ను అయితే సిగ్గు, లజ్జ ఉందా? అంటూ రెచ్చిపోయింది. దీనికి బిగ్‌బాస్ (Biggboss) కూడా వంత పాడినట్టుగానే అనిపిస్తోంది.

Biggboss9: లైవ్‌లో సంజన వీరంగం.. బిగ్‌బాస్ ఫేవరిటిజం

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఈ వారం సంజన (Biggboss Sanjana) ఖాతాలో వేసేయవచ్చు. పోపు కోసం ప్రారంభించిన రచ్చను ఒక రోజంతా కొనసాగించిన ఘనత ఆమెకే దక్కుతుంది. ప్రతి ఒక్కరినీ దారుణంగా మాటలు అనేసింది. తనుజా(Biggboss Tanuja Puttaswamy)ను అయితే సిగ్గు, లజ్జ ఉందా? అంటూ రెచ్చిపోయింది. కేవలం కంటెంట్ ఇవ్వడం కోసం కెమెరాలో తాను మాత్రమే హైలైట్ అవ్వడం కోసమే ఇదంతా చేసినట్టుగా అనిపించింది. తెలుగు అర్థం కాదని కొందరు అంటున్నారు. అంత పర్ఫెక్ట్‌గా మాట్లాడగలుగుతున్నప్పుడు చిన్నచిన్న తెలుగు పదాలు ఆమెకు ఎందుకు అర్థం కాదు? కేవలం కంటెంట్ ఇవ్వడం కోసం చిన్న పదాన్ని పట్టుకుని చాటంత చేసి సంజన రచ్చ చేస్తోంది. ఆమె చేస్తున్నదానికి హౌస్ అంతా ఆమెతో మాట్లాడాలంటేనే భయపడిపోతోంది.

బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో లిమిటెడ్ రేషన్ ఇస్తారు. దానిని అంతా అడ్జస్ట్ చేసుకుని తినాల్సి ఉంటుంది. ఒక పెద్ద బౌల్ పట్టుకొచ్చేసి దాని నిండా తనకు ఫుడ్ చేసి ఇవ్వమని అడిగింది సంజన (Sanjana Garlani). అది చాలదన్నట్టుగా ఒక పెద్ద గిన్నెతో వచ్చిన వెల్లుల్లి కారం అడిగింది. వెల్లుల్లి తక్కువ వచ్చాయి. చేసివ్వడం కష్టమని చెప్పినా వినలేదు. బోడిగుండుకి, మోకాలుకి ముడి పెట్టే ప్రయత్నం చేసింది. దీనికి బిగ్‌బాస్ (Biggboss) కూడా వంత పాడినట్టుగానే అనిపిస్తోంది. ఆమె చేసిన రచ్చంతా ఎడిటింగ్‌ (Biggboss Editing)లో లేపేసి కేవలం సంజన (Sanjana) విషయంలో కంటెస్టెంట్స్ చేసిందే తప్పు అన్నట్టుగా నిన్న రాత్రి షో (Biggboss Show)లో చూపించారు.

లైవ్ (Biggboss Live) చూసిన వారికి అసలేం జరిగిందనేది ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పైగా నెట్టింట లైవ్‌కి సంబంధించిన వీడియోలన్నీ (Biggboss Videos) వైరల్ అవుతున్నాయి. దీంతో సంజన అసలు రంగు బయటపడింది. నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేసింది. ఇలాగే చేస్తూ పోతే సంజన బయటకు వచ్చేందుకు పెద్దగా సమయం అయితే పట్టదు. ఆమె కోసం తనూజ తనకెంతో ఇష్టమైన కాఫీ (Tanuja Sacrifice coffee in Biggboss House)ని త్యాగం చేస్తే కూడా అది పెద్ద విషయమే కాదన్నట్టుగా కొట్టిపడేయడం దారుణం. కొత్తగా వచ్చిన దివ్య నికిత (Biggbos Divya Nikitha)పై అనవసరంగా ద్వేషం పెంచుకుని ఆమెతో మాట్లాడేందుకే ఇష్టపడటం లేదు. ఒకరకంగా అసహ్యించుకుంటోంది. వామ్మో సంజన.. దారుణానికే దారుణమనిపించే ప్రవర్తన.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 30, 2025 5:30 AM