SamsungZTriFold: శాంసంగ్ నుంచి గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్..
శాంసంగ్ ఇటీవల ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ రెండు హింజ్‌లతో పాటు మూడు ఇంటర్‌కనెక్ట్ చేయబడిన డిస్‌ప్లేలతో ఆకట్టుకుంటోంది. టాబ్లెట్ పరిమాణంలో ఈ ఫోల్డబుల్ ఫోన్ ఉంటుంది.
శాంసంగ్ ఇటీవల ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ రెండు హింజ్‌లతో పాటు మూడు ఇంటర్‌కనెక్ట్ చేయబడిన డిస్‌ప్లేలతో ఆకట్టుకుంటోంది. టాబ్లెట్ పరిమాణంలో ఈ ఫోల్డబుల్ ఫోన్ ఉంటుంది. ప్రొడక్టివిటీ, మీడియా, మల్టీ టాస్కింగ్ కోసం శామ్‌సంగ్ ట్రైఫోల్డ్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ మొదట డిసెంబర్ 12న దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తుంది. తరువాత చైనా, తైవాన్, సింగపూర్, యూఏఈ, యూఎస్ సహా ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్‌తో, శాంసంగ్ ప్రతి బ్రాండ్ బోల్డ్ ఆవిష్కరణలను తీసుకొస్తున్న క్రమంలో ప్రస్తుతం మల్టిబుల్ ఫోల్డబుల్ రేసులోకి అడుగుపెట్టింది. అయితే హువావే మేట్ ఎక్స్‌టీలతో ట్రైఫోల్డ్ రంగంలో ముందుంది. ఇది సెప్టెంబర్ 4, 2025న చైనాలో అమ్మకాలను ప్రారంభించింది.
శాంసంగ్, హువామే రెండూ కూడా ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేలు, మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలు, వినూత్న ఫోల్డింగ్ విధానాలను కోరుకునే వినియోగదారులను టార్గెట్ చేస్తున్నాయి. శాంసంగ్ మూడు ఇంటర్‌కనెక్ట్ చేయబడిన స్క్రీన్‌లతో డ్యూయల్-హింజ్ డిజైన్‌ను ప్రస్తుతం పరిచయం చేస్తోంది. మరోవైపు హువావే వచ్చేసి మన్నికైన మెటీరియల్స్‌తో దాని ట్రై-ఫోల్డ్ విధానాన్ని మరింత మెరుగుపరుస్తూనే ఉంది. శాంసంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ ప్రధాన డిస్‌ప్లేను రక్షించే క్రమంలో మల్టిపుల్ ఫోల్డింగ్‌తో లోపలి డిజైన్ ఉంటుంది. అలాగే శాంసంగ్ ఆర్మర్ ఫ్లెక్స్‌హింజ్ సిస్టమ్ సున్నితమైన ఫోల్డింగ్ విధానం, కనీస అంతరాల కోసం డ్యూయల్-రైల్ నిర్మాణంతో రెండు విభిన్న పరిమాణాల హింజ్‌లను కలిగి ఉంది. టైటానియం హింజ్ హౌసింగ్, అడ్వాన్స్‌డ్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ వంటివి మన్నికతో పాటు స్థిరత్వాన్ని అందిస్తాయి.