Rithu Chowdary: రూ.700 కోట్ల స్కామ్.. పెళ్లైన వ్యక్తితో రిలేషన్.. అసలు పేరు మార్చుకుని..
రీతూ చౌదరి... కాంట్రవర్షియల్ క్వీన్.. అసలు పేరు వనం దుర్గ. ఇండస్ట్రీకి వచ్చాక రీతూ చౌదరిగా మారిపోయింది. మరి చౌదరి ఉంటే తప్ప ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమనుకుందో

రీతూ చౌదరి... కాంట్రవర్షియల్ క్వీన్.. అసలు పేరు వనం దుర్గ. ఇండస్ట్రీకి వచ్చాక రీతూ చౌదరిగా మారిపోయింది. మరి చౌదరి ఉంటే తప్ప ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమనుకుందో మరొకటో కానీ పేరు మార్చేసి దానికి చౌదరి తగిలించేసి రీతూ చౌదరిగా చలామణి అవుతోంది. అమ్మడి రూ.700 కోట్ల స్కాం బయటకు రాకుంటే ఆమె వనం దుర్గ అని ఎవరికీ తెలిసి ఉండేది కాదు.. స్కాంతో పాటు అసలు పేరు కూడా బయటకు వచ్చింది.
‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో పాపులర్ అయిన రీతూ ( (Rithu Chowdary) ఆ తరువాత 'ఫ్యామిలీ స్టార్' (Familystar), 'శ్రీదేవి డ్రామా కంపెనీ' (Sridevi Drama Company) వంటి షోస్ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఉంటే బాగానే ఉండేది.. కానీ బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లోకి వెళ్లి జీవితాన్ని మరింత రచ్చ చేసుకుంది. సాధారణంగానే ఈమెపై అలిగేషన్స్ చాలా ఎక్కువ. బిగ్‌బాస్ హౌస్‌లో ఇద్దరిని చుట్టూ తిప్పించుకుంటూ రాధిక అక్కగా మారిపోయింది. హౌస్‌లో నెగిటివిటీ చాలదన్నట్టుగా బయట కూడా విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. ఆమె చేసిన పనులన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో జనాల్లో ఆమె అంటేనే అసహ్యం పెరిగిపోతోంది. ఒక వ్యక్తితో కొంతకాలం పాటు సహజీవనం మీదట అతడిని వివాహం చేసుకుంది. ఆపై రూ.700 కోట్ల స్కామ్‌లోనూ ఇరుక్కుంది.
జగన్ బినామీ..!
అది చాలదన్నట్టుగా అతడితో విడిపోయి.. డ్రింకర్ సాయి హీరో ధర్మ మహేశ్ (Hero Dharma Mahesh)తో చెట్టాపట్టాలేసుకుని రాత్రి పగలూ తేడా లేకుండా తిరిగింది. దీనికి సంబంధించిన వీడియోలతో సహా బయటకు రావడంతో అడ్డంగా ఇరుక్కుపోయింది. చీమకుర్తి శ్రీకాంత్.. ఇతనొక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇతడితో కొంతకాలం పాటు సహజీవనం చేసిన మీదట వివాహం చేసుకుంది. ఆరు నెలలు తిరగక ముందే విడాకుల కోసం కోర్టుకెక్కింది. ఈ కాస్త సమయంలోనే భర్తతో కలిసి రూ.700 కోట్ల స్కాంలో పార్ట్‌నర్ అయ్యిందని ఆరోపణలు వినవచ్చాయి. ఆమె భర్త శ్రీకాంత్ వచ్చేసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy_ బినామీ అని ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు లేఖ రాసిన మాజీ రిజిస్ట్రార్ సింగ్ ఆరోపణలు చేశారు.
కేసు ఫైల్ చేస్తే..
ఈ విషయాన్ని పక్కనబెడితే శ్రీకాంత్‌తో విడిపోయాక అమ్మడికి కావల్సినంత ఫ్రీడం దొరికింది. ఆ తరువాత హీరో ధర్మ మహేశ్‌తో రిలేషన్ పెట్టుకుందనే ఆరోపణలు బయటకు వచ్చాయి. అర్ధరాత్రి సమయంలో అతనితో అతని ఇంట్లోకి వెళ్లి తెల్లవారుజామున బయటకు వస్తున్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను ధర్మ భార్య గౌతమి బయటపెట్టింది. రీతూపై కేసు కూడా ఫైల్ చేయనున్నట్టు వెల్లడించింది. ఒకవేళ ఆమె కేసు ఫైల్ చేశారంటే నామినేషన్స్‌తో కూడా సంబంధం లేదు. నేరుగా ఎలిమినేషనే. అది కాదన్నా కూడా రీతూ చౌదరి బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లో కంటెంట్ కోసమో.. నిజమేనో తెలియదు కానీ డిమాన్ పవన్, పవన్ కల్యాణ్‌తో చేస్తున్న స్నేహం శృతి మించుతోందనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో ఆమెపై నెగిటివిటీ బీభత్సంగా పెరిగిపోతోంది. ఎలా చూసుకున్నా కూడా ఈ వారం ఆమె బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.